యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు తండ్రి పాండు రంగ  క‌న్నుమూశారు. దీంతో ప్రదీప్ ఇంట్లో విషాదం నెల‌కొంది. గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈరోజు ఆయ‌న క‌న్నుమూశారు. 

మ‌రోవైపు ప్ర‌దీప్ కు క‌రోనా వ‌చ్చింద‌ని కొన్నిరోజులుగా వార్తలు వ‌స్తున్నాయి. పాండు రంగ కూడా క‌రోనాతో బాధ ప‌డ్డార‌ని అంటున్నారు. అయితే ఆయ‌న క‌రోనాతో మ‌ర‌ణించారా లేదంటే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా మ‌రణించారా అన్న‌ది తెలియాల్సి ఉంది. 

బుల్లితెరపై రాణిస్తున్న యాంకర్ ప్రదీప్.. ఇటీవల సినిమాల్లోనూ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రదీప్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉండగా.. వైద్యుల సూచన మేరకు వైద్యం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం గురించి ఇప్పటి వరకు ప్రదీప్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇదిలా ఉంటే ప్రదీప్ వైరస్ సోకక ముందు ఈటీవీ ఢీ, జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో లలో యాంకర్ గా బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం వైరస్ సోకిన నేపథ్యంలో తన యాంకరింగ్ స్థానంలో మరో బుల్లితెర యాంకర్ రవి యాంకరింగ్ చేస్తున్నట్లు తాజాగా విడుదలైన ఈ ప్రోగ్రాం ఎపిసోడ్ ప్రోమో లో కనిపించగా.. ప్రదీప్ కు వైరస్ సోకినందుకే అతని స్థానంలో రవిని పెట్టారని తెగ వార్తలు వినిపిస్తున్నాయి.