ఏస్ కొరియోగ్రఫర్, దర్శకుడు మరియు నటుడు ప్రభుదేవా రెండవ వివాహం చేసుకోనున్నట్లు, కొద్దిరోజులుగా నేషనల్ మీడియా కోడై కూస్తుంది. బంధువుల అమ్మాయిని ప్రభుదేవా వివాహం చేసుకోబోతున్నారని వరుస కథనాలు రావడం జరిగింది. ఈ వార్తలపై ప్రభుదేవా నేరుగా స్పందించలేదు. ఐతే ప్రభుదేవా సెకండ్ మ్యారేజ్ లాంఛనమే అని వివరాలు అందుతున్నాయి. ప్రభుదేవా సోదరుడు రాజు సుందరం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 

'అవును ప్రభుదేవా వివాహం చేసుకోబోతున్నారు. ఈ విషయంలో మేము చాలా ఆనందంగా ఉన్నాము, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాము'' అని రాజు సుందరం అన్నారు. ఇక ప్రభుదేవా వివాహం చేసుకొనే అమ్మాయి పేరు హిమాలి అని తెలుస్తుంది. ముంబై కి చెందిన హిమాలి ఫిజియోథెరపిస్ట్. వైద్యం కోసం ప్రభుదేవా ఆమెను మొదటిసారి కలవడం జరిగింది. ఆలా మొదలైన ఆమె పరిచయం పెళ్ళికి దారితీసిందట. 

2021మే నెలలో ప్రభుదేవా-హిమాలి వివాహం చేసుకోనున్నారు. చెన్నైలోని ప్రభుదేవా నివాసంలో ఈ వివాహం గ్రాండ్ గా జరగనుందట. ఎట్టకేలకు ప్రభుదేవా సింగిల్ లైఫ్ కి శుభం కార్డు వేయనున్నారు. ప్రభుదేవా 2011లో భార్య రామలత నుండి విడాకులు తీసుకున్నారు. హీరోయిన్ నయనతారతో డేటింగ్ చేసిన ప్రభుదేవా ఆమెతో పెళ్లి వరకు వెళ్లి, బ్రేకప్ చెప్పారు.