`గాడ్ ఫాదర్` చిత్రానికి ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా చేస్తుండటం విశేషం. చిరంజీవితో ఓ ఆటం బాంబ్ లాంటి పాటని కంపోజ్ చేయబోతున్నారట ప్రభుదేవా.
మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది `గాడ్ ఫాదర్`(God Father) టీమ్. రంజాన్ పండుగ సందర్భంగా మంచి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రానికి ప్రభుదేవా(Prabhudeva) కొరియోగ్రాఫర్‌గా చేస్తుండటం విశేషం. చిరంజీవి(Chiranjeevi)తో ఓ ఆటం బాంబ్ లాంటి పాటని కంపోజ్ చేయబోతున్నారట ప్రభుదేవా. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు థమన్ వెల్లడించారు. ట్విట్టర్‌లో చెబుతూ, ఇందులో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొనబోతున్నారట. చిరంజీవి, సల్మాన్ కాంబినేషన్‌లో ఈ పాట సాగుతుందని, ప్రభుదేవా మార్క్ స్టెప్పులు అదిరిపోయేలా ఉంటాయని, థియేటర్లో ఆటం బాంబ్‌లా పేలబోతున్నాయని చెప్పారు థమన్.
మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఈ ఏడాదిలోనే తెరపైకి రాబోతుందని సమాచారం. ఇందులో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. నయనతార మరో ముఖ్య పాత్రధారి. మలయాళంలో సూపర్ హిట్ అయిన `లూసీఫర్` చిత్రానికిది రీమేక్. అందులో పృథ్వీరాజ్ పాత్రని సల్మాన్ చేస్తున్నారు. వివేక్ ఒబేరాయ్ పాత్రని సత్యదేవ్ చేయబోతున్నట్టు టాక్. చిరంజీవికి ఇందులో హీరోయిన్ లేదు. అందుకోసం ఓ ఐటెమ్ నెంబర్‌ని ప్లాన్ చేసినట్టు టాక్. ప్రభుదేవాతో ఇప్పటికే `శంకర్ దాదా జిందాబాద్` వంటి చిత్రాలకు చిరంజీవితో పనిచేశారు. చాలా గ్యాప్‌తో మరోసారి కొలాబరేట్ కాబోతున్నారు.
ఇదిలా ఉంటే చిరంజీవి ఇటీవల నటించిన `ఆచార్య` చిత్రం డిజాస్టర్ టాక్‌ని సొంతం చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదలైంది. మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీన్నుంచి బయటపడేందుకు చిరంజీవి వెకేషన్ ప్లాన్ చేశారు. తన భార్య సురేఖతో కలిసి చిరంజీవి అమెరికా, యూరప్ టూర్‌కి వెళ్తున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి వెల్లడించారు.
`కరోనా తర్వాత ఇదే తొలి ఇంటర్నేషనల్ జర్నీ. చాలా రోజుల తర్వాత చిన్న హాలీడే తీసుకొని సురేఖతో కలిసి అమెరికా, యూరప్ పర్యటనకు వెళ్తున్నాం. త్వరలోనే అందరిని కలుస్తా` అంటూ సురేఖతో ఫ్లైట్‌లో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. చిరంజీవి పోస్ట్‌పై ఆయన కూతురు శ్రీజతో పాటు కోడలు ఊపాసన కూడా స్పందించారు. `ఎంజాయ్ మమ్మి అండ్ డాడీ, ఐలవ్ యూ సో మచ్` అని శ్రీజ, `హ్యాపీ టైమ్ అత్తయ్య, మామయ్య` అని ఉపాసన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక చిరంజీవి `గాడ్ ఫాదర్`తోపాటు `భోళా శంకర్`, బాబీతో `మెగా154` చిత్రాల్లో నటిస్తున్నారు.
