Asianet News TeluguAsianet News Telugu

#Spirit ప్రభాస్ జేబులోకి 200 కోట్లు? ఎలాగంటే

‘స్పిరిట్‌’(Spirit) లో ప్రభాస్‌ తొలిసారి పోలీస్‌ పాత్రలో అలరించనున్నాడు. ఈ చిత్రం నిమిత్తం ప్రభాస్ కు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అంటే...

Prabhas will hold the theatrical rights of Spirit in Telugu states jsp
Author
First Published Dec 27, 2023, 9:52 AM IST


 ‘యానిమల్’ సినిమాతో ఓ రేంజిలో క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). దాంతో   ఈ దర్శకుడు కొత్త సినిమా అంటే జనాల్లో ఆసక్తి చెప్పక్కర్లేదు. అదీ  పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్(Prabhas) తో అయితే...రచ్చ ఏ రేంజిలో ఉంటుంది. అందులో సలార్ తో సూపర్ హిట్ కొట్టాడు ప్రభాస్. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో గతంలోనే ‘స్పిరిట్‌’(Spirit)అనే టైటిల్ తో  సినిమా ప్రకటించారు. ‘స్పిరిట్‌’(Spirit) లో ప్రభాస్‌ తొలిసారి పోలీస్‌ పాత్రలో అలరించనున్నాడు. ఈ చిత్రం నిమిత్తం ప్రభాస్ కు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అంటే...

                           మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రెమ్యునరేషన్ గా  ప్రభాస్ ...తెలుగు రైట్స్ తీసుకున్నారట. ఈ మేరకు ఎగ్రిమెంట్స్ ఎప్పుడో పూర్తయ్యాయని వినికిడి. తెలుగు రాష్ట్రాల్లో సలార్ తర్వాత థియేటర్ బిజినెస్ బాగా పెరిగింది. దాదాపు 150 కోట్లు దాకా పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభాస్ సొంతంగా రిలీజ్ చేసుకుంటే..సినిమా హిట్టైతే మరో యాభై కోట్లు ఖచ్చితంగా వస్తాయి. అంటే 200 కోట్లు పై చిలుకు స్పిరిట్ తో పాకెట్ లో వేసుకోబోతున్నారు ప్రభాస్.  యానిమల్ సూపర్ సక్సెస్ తో సందీప్ వంగాకు దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చేసింది. అది ఖచ్చితంగా స్పిరిట్ ఓపినింగ్స్, బిజినెస్ పై కనిపిస్తుందనటంలో సందేహం లేదు.  యానిమల్ సినిమాతో సందీప్ వంగా తనలోని ఇంటెన్స్ యాంగిల్ ను చూపించడమే స్పిరిట్ మూవీ హై లెవెల్ బిజినెస్కి ప్రధానమైన కారణం.. . సినిమా షూటింగ్ 2024లో ప్రారంభమై 2025 లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. 
 
                            దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఈ సినిమా  గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆడియన్స్ దృష్టి కూడా సందీప్ వంగా స్పిరిట్ మూవీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోన్నారు. స్పిరిట్ మూవీని టీసిరీస్  తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.   స్పిరిట్  చిత్రాన్ని  2025 క్రిస్మస్ లేదా సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించాడు. సెప్టెంబరు 2024లో షూటింగ్ ప్రారంభిస్తానని, ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ పూర్తి చేస్తానని తెలిపాడు. ఈ సినిమాలో ప్రభాస్ నిజాయతీ, ధైర్యసాహసాలు కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని ప్రకటించాడు సందీప్.

                                   యానిమల్ ప్రమోషన్ సందర్భంగా సందీప్ వంగా మాట్లాడుతూ యానిమల్ రిలీజ్ అయిన వెంటనే, స్పిరిట్ పనిని ప్రారంభిస్తానని, సెప్టెంబర్ 2024లో షూటింగ్ ప్రారంభిస్తానని చెప్పాడు. సందీప్ రెడ్డి వంగా రైటింగ్ కు ఎక్కువ టైమ్ తీసుకుంటాడు. యానిమల్ కోసం దాదాపు 18 నెలలు గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు.. స్పిరిట్ కోసం మాత్రం అంత టైమ్ తీసుకోనని తెలిపాడు. ఎందుకంటే, ప్రభాస్ కు కథ చెబుతున్నప్పుడే, చాలా సన్నివేశాల ట్రీట్ మెంట్ పూర్తయిపోయిందని చెప్పుకొచ్చారు. భయం అన్నదే తెలియని ఒక కరడుగట్టిన పోలీస్ అధికారి కథతో 'స్పిరిట్' రూపొందనున్నట్టు తెలుస్తోంది.  
 
                          నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ...‘‘  ‘స్పిరిట్‌’చాలా ప్రత్యేకమైన సినిమా. పోలీస్‌ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు’’ అని భూషణ్‌ కుమార్‌ చెప్పారు. ఈ వార్త విన్న ప్రభాస్‌ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అప్‌డేట్స్‌ త్వరగా ఇవ్వాలంటూ సోషల్‌మీడియాలో సందడి చేస్తున్నారు.
   
                              ప్రభాస్ ప్రస్తుతం  అటు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె', దర్శకుడు మారుతి తో మరో  చిత్రంలోనూ నటిస్తున్నారు.  అయితే, ప్రభాస్ ను పోలీస్ పాత్రలో చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే 'స్పిరిట్' చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? ప్రభాస్ ను ఎప్పుడు ఖాకీ డ్రెస్ లో చూస్తామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios