Asianet News TeluguAsianet News Telugu

Prabhas: ఆ స్టార్‌ డైరెక్టర్‌తో సినిమా చేయలనుకుంటున్నా ప్రభాస్‌.. కలిపేందుకు ప్రయత్నాలు?

అందరు దర్శకులు ప్రభాస్‌తో సినిమా చేసేందుకు వెయిట్‌ చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం మరో స్టార్‌ డైరెక్టర్‌తో సినిమా చేయాలనకుంటున్నారట. అదే ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

prabhas wants to work with that star director ? interesting news viral arj
Author
First Published Nov 16, 2023, 1:34 PM IST

ప్రభాస్‌ కోసం చాలా మంది దర్శకులు వెయిటింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలు చేస్తున్నారు. మరో మూడు చిత్రాలకు కమిట్‌ అయ్యాడు ప్రభాస్‌. మరో రెండు మూడు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. వీటికితోడు ప్రస్తుతం చేస్తున్న మూవీస్‌లో రెండు.. టూ పార్ట్స్ గా రాబోతున్నాయి. ఇలా ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ మనసులో ఓ బలమైన కోరిక ఉంది. 

డార్లింగ్‌ మాత్రం ఓ స్టార్‌ డైరెక్టర్‌తో సినిమా చేయాలనుకుంటున్నారు. ఆయనతో సినిమా చేయాలనేది చాలా రోజులుగా తన కోరిక అట. అయితే దాన్ని కార్యరూపం దాల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆ వివరాలు చూస్తే.. గ్లోబల్‌ స్టార్‌గా ఎదుగుతున్న ప్రభాస్‌కి.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా చేయాలని ఉందట. ప్రస్తుతం ఆయన వరుసగా యాక్షన్‌ మూవీస్‌ చేస్తున్న నేపథ్యంలో కూల్‌గా ఉండే రిలాక్స్ గా అనిపించే ఫ్యామిలీ సినిమా త్రివిక్రమ్‌తో చేయాలని అనుకుంటున్నారట. 

నిజానికి ఇది ఆయనకు చాలా రోజులుగా ఉన్న కోరిక అని టాక్‌. ఆ విషయం బయటపెట్టడంతో ఆ ప్రాజెక్ట్ సెట్‌ చేసే బాధ్యతలు తన సొంత బ్యానర్‌ యూవీ క్రియేషన్‌ తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్‌.. మహేష్‌బాబుతో `గుంటూరు కారం` చిత్రం చేస్తున్నారు. సంక్రాంతికి ఇది విడుదల కానుంది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేసే కమిట్‌ మెంట్‌ ఉంది. నెక్ట్స్ అదే చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ తర్వాతి మూవీగా ప్రభాస్‌తో ఉండేలా ప్లాన్‌ జరుగుతుందట. దీన్ని యూవీ నిర్మాతలు ఇనిషియేట్‌ తీసుకుంటున్నారని సమాచారం. 

మరి అందుకు త్రివిక్రమ్‌ రియాక్షన్‌ ఏంటి? ప్రభాస్‌తో చేసేందుకు ఆయన సిద్ధమేనా? అనేది చూడాలి. అయితే ప్రభాస్‌ లాంటి హీరో ఇంట్రెస్ట్ చూపించారంటే కచ్చితంగా నో చెప్పే ఛాన్స్ ఉండదు. దీంతో ఈ ప్రాజెక్ట్ లేట్‌ అయినా సెట్‌ అవడం ఖాయం అని చెప్పొచ్చు. త్రివిక్రమ్‌ ఏం చేసినా హారికా అండ్‌ హాసినీలో మూవీ చేస్తారు. దీంతో ఈ బ్యానర్‌ కూడా ఆ ప్రాజెక్ట్ లో భాగమయ్యే అవకాశాలు ఉండొచ్చు. 

త్రివిక్రమ్‌ ఇప్పటి వరకు పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, నితిన్‌లతోనే సినిమాలు చేశారు. ఇది సెట్‌ అయితే మరో కొత్త హీరో ఆయన జాబితాలో చేరతారని చెప్పొచ్చు. అయితే ఈ ఐడియా జస్ట్ ప్రాథమిక ఆలోచనలోనే ఉందని టాక్‌. మరి కార్యరూపం వరకు వెళ్తుందా అనేది చూడాలి. ఇక ప్రభాస్‌ ప్రస్తుతం `సలార్‌`తో వచ్చే నెలలో రాబోతున్నారు. `కల్కీ2898ఏడీ` చిత్రీకరణ దశలో ఉంది. మారుతితో సినిమా షూటింగ్‌ జరుగుతుంది. నెక్ట్స్ సందీప్‌ రెడ్డి వంగాతో ఓ సినిమా, బాలీవుడ్‌ డైరెక్టర్‌తో ఓ సినిమా, `సీతారామం` ఫేమ్‌ హను రాఘవపూడితో మరో సినిమా చేయబోతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios