శ్రీమహావిష్ణువు శక్త్యావేశ అవతారం అయిన పరశురాముడు 21 సార్లు సమస్థ భూ మండలాన్ని పర్యటించి క్షత్రియులను సంహరించాడు.  


పౌరాణిక పాత్రలకు ఫెరఫెక్ట్ గా ఉంటాడు ప్రభాస్. అందుకేనే ఆయన చేత ఆదిపురుష్ చేయించారు. అంతకు ముందు రాజు పాత్రలో బాహుబలి లో కనపడ్డారు. ఇప్పుడు మరో పౌరాణిక పాత్రలో ఆయన కనపడనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్ర మరేదో కాదు పరుశురాముడు. క్షత్రియులలో అధర్మ ప్రవర్తన పెరిగి, దుర్మదాంధులైన వారిని నశింపచేసి భూభారాన్ని తగ్గించిధర్మాన్ని నిలబెట్టడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయుడు దాల్చిన అవతారం మరియు వీరు సప్త చిరంజీవులలో ఒకరైన పరుశురామ అవతారంలో కనిపించనున్నారు. 

తన తండ్రి జమదగ్ని నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొందినవాడు కనుకనే ఆయనని “పరశురాముడు” అని పిలుస్తారు. శ్రీమహావిష్ణువు శక్త్యావేశ అవతారం అయిన పరశురాముడు 21 సార్లు సమస్థ భూ మండలాన్ని పర్యటించి క్షత్రియులను సంహరించాడు. వారి రక్తంతో తన పూర్వీకులకు ఆత్మ తృప్తిని కలిగించాడు. ఆ పాత్రలో ప్రభాస్ కనిపిస్తే ఓ రేంజిలో ఉంటుందంటున్నారు. అయితే పరుశురామ్ పాత్ర ప్రధానంగా నడిచే సినిమాలో మాత్రం కాదుట. ఆ డిటేల్స్ లోకి వెళితే...

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్​ తివారీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'రామాయణ్'. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో వార్తలు ప్రతీ రోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. స్టార్స్ నుంచి ఈ సినిమా బడ్జెట్​ వరకు వార్తలు వచ్చి ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. ఇక రావణ్‌ గా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్‌, కైకేయి పాత్రలో లారా దత్తా, విభీషణ పాత్రలో విజయ్ సేతుపతి, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నారు. 

ఇప్పటికే అర్దమయ్యే ఉంటుంది..ఈ సినిమాలోనే ప్రభాస్ కనిపించనున్నారట. ఆది పురుష్ లో రాముడిగా కనిపించిన ప్రభాస్ ఈ రామాయణంలో పరశురాముడిగా స్పెషల్ అప్పీరెన్స్​ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అది ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. ఈ కాస్టింగ్​పై అఫీషియల్ అనౌన్స్​మెంట్ అయితే ఇంకా రాలేదు. శ్రీరామ నవమి రోజున దర్శకుడు ఈ మూవీకి సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. 2025 దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా మేకర్స్ శరవేగంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని, అంతేకాదు ఈ ఇతిహాసాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.