నా పేరు సూర్య కి ముఖ్య అతిథిగా బాహుబలి

Prabhas to attend na peru surya pre release event
Highlights

నా పేరు సూర్య కి ముఖ్య అతిథిగా బాహుబలి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య.. నా పేరు ఇండియా చిత్రం రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఇటీవల రిలీజైన టీజర్లు, డైలాగ్ ఇంపాక్ట్ అభిమానుల్లో క్రేజ్‌ను పెంచేసింది. ప్రస్తుతం నా పేరు సూర్య ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ జోష్ ఓ వైపు కొనసాగుతుండగానే అల్లు అర్జున్ అభిమానులకు ఓ ఫెంటాస్టిక్ న్యూస్ అందించాడు.

నా పేరు సూర్య ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా ప్రభాస్ హాజరు కానున్నారనే వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. అయితే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి వార్త రాకపోయినప్పటికీ.. విశ్వసనీయ వర్గాలు ఆ వార్త నిజమేనంటున్నారు. కథా రచయిత వక్కంత వంశీ దర్శకుడిగా మారి నా పేరు సూర్య సినిమాను తెరకెక్కించాడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించిన చిత్రం మే 4వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

loader