యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరందుకోనున్నాయి. ఆగష్టు 15న సాహో విడుదల కానుంది. ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

ప్రచార కార్యక్రమాలు ద్వారా వీలైనంత ఎక్కువగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రచారాలకు బుల్లితెర కార్యక్రమాలని బాగా ఉపయోగించుకుంటున్నారు. సాహో యూనిట్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో కానున్నట్లు తెలుస్తోంది. 

యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కొంచెం టచ్ లో ఉంటే చెబుతా'. రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నెం 1 యారీ, కింగ్ నాగ్ హోస్ట్ గా వ్యవహరించబోతున్న బిగ్ బాస్ 3 షోలలో ప్రభాస్, శ్రద్దా కపూర్ అతిథులు గా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ మీడియా ముందుకు పెద్దగా రాని ప్రభాస్ బుల్లి తెర కార్యక్రమాల్లో కనిపిస్తే ఫ్యాన్స్ కు అంతకంటే ఏం కావాలి!