Asianet News TeluguAsianet News Telugu

#TheRajaSaab ప్రభాస్ 'రాజా సాబ్ ' రిలీజ్ డేట్ !ఆ రోజుకే ఫిక్స్ అయ్యారా.,సూపర్

 ది రాజా సాబ్(The Raja Saab)టైటిల్ ,లుక్ చూడగానే  ఫ్యాన్స్ పండగు చేసుకున్నారు. అలాగే ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది అంటూ మారుతి అనౌన్స్ చేయగా ఆ ఆనందం రెట్టింపు అయ్యింది. 

Prabhas #TheRajaSaab will be out in 2024 jsp
Author
First Published Jan 25, 2024, 10:13 AM IST

సలార్ తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ తన తదుపరి చిత్రాలని  రెడీ చేసేస్తున్నారు. ఆ వరసలో  డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌ ( Maruthi)లో రూపొందుతున్న 'రాజా సాబ్ '  కూడా ఉంది.  షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అయినా టైటిల్ ను కానీ ఫస్ట్ లుక్ ని కానీ ఇప్పటి వరకు రివీల్ చేయకుండా జాగ్రత్త పడి మొన్న  సంక్రాంతి పండగ సందర్బంగా సినిమా అఫీషియల్ టైటిల్ ను ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. లుంగీ కట్టుకుని మాస్ లుక్ లో ప్రభాస్ నడిచొస్తున్న ఈ ఫస్ట్ లుక్ సింపుల్ గా అదిరిపోయిందనే  చెప్పాలి.

 ది రాజా సాబ్(The Raja Saab)టైటిల్ ,లుక్ చూడగానే  ఫ్యాన్స్ పండగు చేసుకున్నారు. అలాగే ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది అంటూ మారుతి అనౌన్స్ చేయగా ఆ ఆనందం రెట్టింపు అయ్యింది. దాంతో ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది. రిలీజ్ ఎప్పుడు అనే టాపిక్ మొదలైంది.  అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం క్రిస్మస్ సందర్బంగా రిలీజ్ అవనుంది.  2024 డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.  అయితే  మేకర్స్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే దాకా ఇదే ఫైనల్ అని చెప్పలేము.
  
ఇక లోకల్ ఆడియన్స్ కి ఒకప్పటి ప్రభాస్ మిస్టర్ పెర్ఫెక్ట్, మిర్చి లాంటి… టచ్ ఉన్న కమర్షియల్ మూవీ ని ఇవ్వలేక్ పోయాడు….సలార్(Salaar) బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపినా కూడా వింటేజ్ ప్రభాస్ అయితే ఇంకా తిరిగి రాలేదు… ఇలాంటి టైంలో మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా మూవీని అనౌన్స్ చేయగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి అఫీషియల్ గా..వింటేజ్ లుక్ తో రావటం మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.  డైనోసార్‌.. పక్కా డార్లింగ్‌గా ట్రాన్స్ ఫర్మేషన్‌ అయిన సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సగర్వంగా మన ముందుకు తీసుకురాబోతోంది.

'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని ఇస్తున్నాడు.
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios