బాహుబలి అనంతరం సాహో సినిమాతో ప్రభాస్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో  గాని నేషనల్ వైడ్ గా సినీ ప్రేక్షకులు బారి అంచనాలు పెట్టేసుకున్నారు. అంచనాలు ఏ మాత్రం తలకిందులైనా మొదటికే మోసం వస్తుంది. చిత్ర యూనిట్ కూడా ఆడియెన్స్ టేస్ట్ కి తగ్గట్టుగానే ప్రాజెక్ట్ ఉంటుందని కొన్ని మేకింగ్ వీడియోలతో మరింత హైప్ క్రియేట్ చేసింది.  

అసలు మ్యాటర్ లోకి వస్తే.. కోలీవుడ్ లో బాహుబలి ఇచ్చిన కిక్కుకు తమిళ్ ఆడియెన్స్ మైండ్ సెట్ మారిపోయింది. సాహో కోసం వారు కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ సినిమాతో సూర్య సినిమా ఫైట్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. సాహో సినిమాకు ఎలాంటి పెద్ద సినిమాలతో క్లాష్ అవ్వకూడదని యువీ క్రియేషన్స్ ఆలోచించి ఆగష్టులో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. .   

ఆగష్టు 15న సినిమా రానుందని తెలుగు - తమిళ్ - హిందీ భాషల్లో న్యూస్ ని వైరల్ చేశారు. అయితే సూర్య - కెవి.ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కాప్పాన్ సినిమా కూడా అప్పుడే రానుంది. అయితే ఆ మధ్య సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ఆగస్టు 30న వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది కానీ అందులో ఇంకా క్లారిటీ లేదు. టీజర్ విడుదల చేసినప్పుడు కూడా రిలీజ్ డేట్ ని చెప్పకుండా  కాప్పాన్ గ్యాంగ్ సస్పెన్స్ క్రియేట్ చేసింది. 

తమిళ్ లో 200కోట్లకు పైగా సాహో బిజినెస్ చేసే అవకాశం ఉంది. పెద్ద సినిమాలు ఏవైనా అడ్డొస్తే ఆ మార్క్ ను అందుకోవడం కష్టమే. పైగా సూర్య సినిమాలకు ఇప్పుడు మరింత డిమాండ్ పెరిగింది. మరి సాహో వర్సెస్ సూర్య ఫైట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.