ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో `సలార్‌` ఒకటి. `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ సరసన శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. హోంబలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్‌ కిరంగుదూర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. రామగుండం బొగ్గు గనుల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఈ సందర్భంగా లీకైన ఫోటోలు ఆ మధ్య వైరల్‌గా మారాయి. తాజాగా సినిమాకి సంబంధించి మరో అప్‌డేట్‌ ఇవ్వబోతుంది యూనిట్‌. 

ప్రభాస్‌ తన ఫ్యాన్స్ కి స్వీట్‌ సర్‌ప్రైజ్‌ రెడీ చేశారట. ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3.25గంటలకు చిత్ర విడుదల తేదీని ప్రకటించబోతున్నామని చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమా బొగ్గు గనుల్లో పనిచేసే నాయకుడి పోరాటం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. కథకి తగ్గట్టే టైటిల్‌ విషయంలో బ్లాక్‌ కలర్‌ పాట్రన్‌ని ఫాలో అవుతుంది యూనిట్‌. టైటిల్‌ నుంచి, దీనికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ బ్లాక్‌ బోర్డ్ పాట్రన్‌ ని వాడుతున్నారు. బొగ్గు, మసి కలర్‌లో సాగుతుంది. ఇదిలా ఉంటేఈ చిత్ర విడుదల తేదీనిపై ఆసక్తి నెలకొంది. 

ఇదిలా ప్రస్తుతం `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్న ప్రభాస్‌. పూజా హెగ్డే కథానాయికగా, రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్‌ చిత్రం జులై 30న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో విడుదల కానుంది. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్ పతాకాలపై ప్రసీద, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. దీంతోపాటు `ఆదిపురుష్‌`లో ప్రభాస్‌ నటిస్తున్నారు. రాముడిగా ఆయన కనిపించనున్నారు. ఈ చిత్ర విడుదల తేదీని కూడా ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో `సలార్‌`ని ఈ ఏడాదిలోనే అక్టోబర్‌ తర్వాతగానీ, డిసెంబర్‌లోగాని విడుదల చేసే అవకాశాలున్నాయి.