ప్రభాస్ నటించిన సలార్ భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో సలార్ 2 పై అంచనాలు ఏర్పడ్డాయి. కాగా సలార్ 2 విడుదల ఎప్పుడో చెప్పాడు నటుడు బాబీ సింహ.  

సలార్ తో హిట్ ట్రాక్ ఎక్కాడు ప్రభాస్. బాహుబలి 2 అనంతరం ప్రభాస్ నటించిన మూడు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రభాస్ ఇమేజ్ కి సెట్ అయ్యేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించాడు. గత ఏడాది డిసెంబర్ 22న విడుదలైన సలార్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా సలార్ కి సీక్వెల్ ఉన్న విషయం తెలిసిందే. అసలు కథ అంతా పార్ట్ 2లోనే దాచి ఉంచాడు ప్రశాంత్ నీల్. 

శౌర్యంగ పర్వం ఏమిటో పార్ట్ 2లో చూపించనున్నారు. సలార్ 2 విడుదల ఎప్పుడనే సందేహం అందరిలో ఉంది. సలార్ మూవీలో కీలక రోల్ చేసిన నటుడు బాబీ దీనిపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ... 2025లో సలార్ 2 విడుదల ఉంటుందని అన్నారు. అలాగే నిర్మాత విజయ్ కిరంగదూర్ సలార్ 2 స్క్రిప్ట్ పూర్తి అయ్యింది. షూటింగ్ కి ప్రభాస్, ప్రశాంత్ నీల్ సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు. 

కాబట్టి ప్రభాస్ త్వరలో సలార్ 2 సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశం కలదు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2829 AD , రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి రెండు షూటింగ్ జరుపుకుంటున్నాయి. కల్కి సైన్స్ ఫిక్షన్ మూవీ. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక రాజా సాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. 

అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ ఒక చిత్రం చేయాల్సి ఉంది. స్పిరిట్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. స్పిరిట్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ అని ఇటీవల సందీప్ రెడ్డి వంగ చెప్పుకొచ్చాడు. స్పిరిట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సీతారామం ఫేమ్ హను రాఘవపూడితో ప్రభాస్ ఓ చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం.