సలార్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు ప్రభాస్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ క్రమంలో సలార్ 2పై అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ గురించి నటుడు  పృథ్విరాజ్ సుకుమారన్ కీలక అప్డేట్.  

డిసెంబర్ 22న విడుదలైన సలార్ టాలీవుడ్ బడా హిట్స్ లో ఒకటిగా ఉంది. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ సలార్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్లు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు. షారుఖ్ ఖాన్ డంకీ ఈ చిత్రానికి పోటీగా విడుదలైంది. డంకీ కి మించిన ఆదరణ సలార్ దక్కించుకుంది. సలార్ వరల్డ్ వైడ్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

ఈ క్రమంలో సలార్ 2 పై అంచనాలు ఏర్పడ్డాయి. శౌర్యంగ పర్వం పేరుతో రెండవ భాగంలో ప్రశాంత్ నీల్ అసలు కథ చెప్పనున్నాడు. సలార్ 2లోనే అసలు మేటర్ ఉందట. అందుకే సలార్ కథ అసంపూర్తిగా ఉంది. మరి సలార్ 2 ఎప్పుడు వస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. కీలక రోల్ చేసిన పృథ్విరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చాడు. తన లేటెస్ట్ మూవీ ది గోట్ లైఫ్ ప్రొమోషన్స్ లో పాల్గొన్నారు. 

ఈ మేరకు విలేకరులు సలార్ 2 ఎప్పుడని పృథ్విరాజ్ ని అడిగారు. అతి త్వరలో సలార్ 2 షూటింగ్ మొదలు కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పాడు. కాబట్టి ప్రభాస్ కూడా సలార్ 2 షూటింగ్ లో వీలైనంత త్వరగా జాయిన్ కానున్నాడన్న మాట. సలార్ పార్ట్ 1 లో ప్రభాస్-పృథ్విరాజ్ సుకుమారన్ ప్రాణ మిత్రులుగా కనిపించారు. పార్ట్ 2 లో వారు బద్ద శత్రువులుగా అలరిస్తారు. 

మరి ప్రాణ మిత్రుల మధ్య వైరానికి కారణం ఏమిటనేది అసలు కథ. సోలార్ 2 లో ప్రధాన విలన్ గా పృథ్విరాజ్ సుకుమారన్ ఉంటాడట. మరోవైపు ప్రభాస్ కల్కి 2829 AD , రాజా సాబ్ చిత్రాలు పూర్తి చేస్తున్నాడు. కల్కి సమ్మర్ కానుకగా మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. శివరాత్రి కానుకగా విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంది. ఇక మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చేస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయాల్సి ఉంది. 

Scroll to load tweet…