బాహుబలి తరువాత వెండితెరకు మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఇక తన అసలైన మ్యానియాను మొదలుపెట్టనున్నాడు.  ప్రభాస్ రేపు 'ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లు చెప్పారు. అదేమిటో తెలియాలంటే తన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండని అన్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Hello darlings... A surprise coming your way, tomorrow. Stay tuned... #SaahoSurprise

A post shared by Prabhas (@actorprabhas) on May 19, 2019 at 11:31pm PDT

ఆ స్పెషల్ సర్‌ప్రైజ్ ఏమిటా అని అభిమానుల్లో ఇప్పుడు ఎంతో ఆసక్తి పెరిగింది. నార్త్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ప్రభాస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. సాహోకి సంబందించిన ఎదో ఒక వీడియోతో సర్‌ప్రైజ్ ఇస్తారా లేక రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారా అనేది తెలియాలంటే రేపటివరకు వెయిట్ చేయాల్సిందే. 

సాహో సినిమాతో పాటు జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న మరో లవ్ స్టోరీతో ప్రభాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక సాహో సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ చెయ్యాలని యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది.