'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ చిత్రం 'సాహో'. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు  రానుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజర్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఫోటో లీకైంది. ఆ ఫోటోలో ప్రభాస్, శ్రద్ధా రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ కనిపిస్తున్నారు. వైట్ లో షర్ట్ లో ప్రభాస్, పింక్ కలర్ డ్రెస్ లో శ్రద్ధా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ ఫోటోని విపరీతంగా షేర్ చేస్తున్నారు. 

ఓ పాట చిత్రీకరణలో భాగంగా ఈ ఫోటో బయటకి వచ్చి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.  ఇప్పటివరకు సాహో సినిమాకు సంబంధించిన ప్రోమోలు, టీజర్ లు యాక్షన్ ప్రధానంగా సాగాయి. ఇప్పుడు లీక్ అయిన ఫోటో రొమాంటిక్ స్టిల్ కావడంతో అభిమానుల్లో జోష్ వస్తోంది.