Asianet News TeluguAsianet News Telugu

#Salaar అఫీషియల్ సినాప్సిస్(స్టోరీ లైన్) ఇదే

 సెన్సార్ బోర్డు ఈ మూవీకి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. స‌లార్ మూవీలో యాక్ష‌న్ సీన్స్‌తో పాటు వ‌యోలెన్స్ ఎక్కువ ఉండ‌డం వ‌ల‌న ఏ సర్టిఫికెట్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. అలాగే సలార్ ర‌న్‌టైం 2 గంట‌ల 55 నిమిషాలు ఉన్న‌ట్లు స‌మాచారం.

Prabhas #SalaarCeaseFire movie Synopsys jsp
Author
First Published Dec 16, 2023, 7:57 AM IST

యానిమల్ హవా మెల్లిగా తగ్గుతూ సలార్ ఊపు అందుకుంటోంది. ఎక్కడ చూసినా సలార్ వార్తలే. కెజియఫ్ 2' తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సలార్' కావంటోతో అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.  ఈ సినిమాని సైతం 'కెజియఫ్' తరహాలో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కెజియఫ్', 'కెజియఫ్ 2' నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాను కూడా నిర్మిస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మాత. ఇందులో ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు. జర్నలిస్ట్ ఆద్య పాత్రను ఆమె పోషిస్తున్నారు.  ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  సలార్ పార్ట్ 1: సీజ్‍‍ఫైర్ సినిమా కోసం సినీ ప్రేక్షకులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో  సలార్ పార్ట్ 1: సీజ్‍‍ఫైర్ కలెక్షన్ల సునామీ సృష్టించటం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. కాగా, తాజాగా ఈ చిత్రం సినాప్సిస్ బయిటకు వచ్చింది. 

సినాప్సిస్ ప్రకారం... ఓ గ్యాంగ్ లీడర్ తన చనిపోబోతున్న తన స్నేహితుడుకి  చేసిన ప్రామిస్ ని నిలబెట్టుకోవటం కోసం క్రిమినల్ గ్యాంగ్స్ పై యుద్దమే ఈ చిత్రం.
 
సెన్సార్ బోర్డు ఈ మూవీకి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. స‌లార్ మూవీలో యాక్ష‌న్ సీన్స్‌తో పాటు వ‌యోలెన్స్ ఎక్కువ ఉండ‌డం వ‌ల‌న ఏ సర్టిఫికెట్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. అలాగే సలార్ ర‌న్‌టైం 2 గంట‌ల 55 నిమిషాలు ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు స‌లార్ ట్రైల‌ర్‌కు మిక్స్‌డ్ రివ్యూలు రావ‌డంతో మేక‌ర్స్ స‌లార్ నుంచి రెండో ట్రైల‌ర్ ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే.  

సలార్, వరద రాజ మన్నార్‌ స్నేహం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.  హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్.. ‘సలార్ పార్ట్ 1: సీజ్‍‍ఫైర్’ సినిమాను ప్రొడ్యూజ్ చేస్తున్నారు. రవిబస్రూర్ సంగీతం అందించగా.. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేశారు.  ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు. వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ  హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిసెంబ‌ర్ 22న విడుద‌ల కానుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios