Asianet News TeluguAsianet News Telugu

#Salaar షాక్: ‘సలార్’కి మూడో పార్ట్ ? అందులో కంటెంట్ ఏంటంటే

 నీల్ ఖాన్సార్ కోసం ప్లాన్ చేసింది చాలా భారీగా ఉండబోతోందని  తెలుస్తోంది. పార్ట్ 2 లో కేవలం వర్దతో కిరీటం కోసం పోరాటం మాత్రమే చూపెడతారని, అందుకునే దాన్ని ‘శౌర్యాంగ పర్వం’అని చెప్తున్నారట.

Prabhas #Salaar ultimate Clash in Part 3? jsp
Author
First Published Jan 21, 2024, 12:36 PM IST


బ్లాక్‍బాస్టర్ మూవీ సలార్ సినిమా ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.అనుకున్న  దానికంటే ముందే ఈ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ తీసుకొచ్చి ఫ్యాన్స్ కు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.  ఈ నేఫద్యంలో ఈ చిత్రం గురించి మరో విషయం బయిటకు వచ్చింది. ఈ చిత్రం పార్ట్ 3 కూడా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది.

సలార్ చిత్రం కథ చాలా పెద్దదని, రెండు పార్ట్ లలో కథ చెప్పటం కష్టమని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. దాంతో మరో పార్ట్ కు సన్నాహాలు చేస్తున్నారట. ఇండియన్ స్క్రీన్ పై రేర్ ట్రయాలిజీ అంటున్నారు. నీల్ ఖాన్సార్ కోసం ప్లాన్ చేసింది చాలా భారీగా ఉండబోతోందని  తెలుస్తోంది. పార్ట్ 2 లో కేవలం వర్దతో కిరీటం కోసం పోరాటం మాత్రమే చూపెడతారని, అందుకునే దాన్ని ‘శౌర్యాంగ పర్వం’అని చెప్తున్నారట.  పార్ట్ 3 లో అల్టిమేట్ క్లాష్ ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇవి ఆధారం లేని వార్తలు మాత్రమే. అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
 
ప్రభాస్  పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హసన్ కీలక పాత్రలు పోషించిన   సలార్ సినిమా తొలి భాగం ‘సలార్- సీజ్ ఫైర్’తెలుగు భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ చూసి  రెండో భాగం ‘శౌర్యాంగ పర్వం’ఎప్పుడూ అని అడుగుతున్నారు. అయితే ఇది ప్యాన్ ఇండియా సినిమా. కేవలం తెలుగు మార్కెట్ మాత్రమే కాదు ...హిందీ, కన్నడ, మళయాళ,తమిళ మార్కెట్ లలో కూడా అక్కడ భాషల్లోకి డబ్బింగ్ అయ్యి భారీగా రిలీజ్ అయ్యింది.   భారీ అంచనాల మధ్య సలార్ సినిమా గత డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ మూవీకి రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంతో ప్రభాస్ మళ్లీ హిట్ బాటపట్టారు. సలార్‌లో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు విపరీతంగా మెప్పించాయి.
 
సలార్ చిత్రాన్ని హెంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ చేశారు.
   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios