‘సలార్’:ప్రభాస్ ఓకే అంటే ఇంకో వంద కోట్లు
ప్రశాంత్ నీల్ - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజియస్ట్ పాన్ ఇండియా ఫిలిం సలార్ మూవీ షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో మొదలు కాబోతుంది.
‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ కు ‘సలార్’ నెక్ట్స్ లెవిల్ ఫిల్మ్. ‘కె.జి.ఎఫ్’తో దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరంగందూర్ జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురి కలయికలో రూపొందనున్న మరో పాన్ ఇండియా చిత్రమే... ‘సలార్’. ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ తో బిజినెస్ ఏ రేంజిలో జరుగుతుందో మనం ఊహించవచ్చు. అయితే నిర్మాత మరో ఆలోచన చేస్తున్నారట. ఇంతకు రెట్టింపు ఆదాయ మార్గం ప్లాన్ చేసారట. అయితే అందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఆ కొత్త ఆలోచన ఏమిటీ అంటే...
సలార్ కూడా రెండు భాగాలుగా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో నిర్మాణ సంస్థ ఉన్నట్టు సమాచారం. ప్రశాంత్, నిర్మాత సైతం దీని గురించి చర్చిస్తున్నట్టు తెలిసింది. బడ్జెట్ పరంగా భారం కాకుండా తాను జాగ్రత్తగా ప్లాన్ చేస్తానని నీల్ అన్నట్టు వినికిడి. బాహుబలి, కెజిఎఫ్ చిత్రాలు ఈ రెండు భాగాల ఫార్ములా వల్ల ఎంత లాభ పడ్డాయో ఎన్ని వందల కోట్లు అదనంగా వచ్చి పడ్డాయో తెలిసిందే. దాంతో సలార్ కు సైతం అలాగే చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ప్రభాస్ దగ్గర పెట్టారట.
అయితే ప్రభాస్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. వరస ప్రాజెక్టులు సైన్ చేసారు. ప్రస్తుతం చేస్తున్న ఆది పురుష్ తర్వాత నాగ అశ్విన్ సోసియో ఫాంటసీ ప్రాజెక్ట్ ఉంది. ఇవి కాకుండా మరికొన్ని కథా చర్చలు జరుపుకుంటున్నాయి. ఇప్పుడు సలార్ ఎక్స్ టెన్షన్ అంటే కాల్ షీట్లు డేట్లు చాలా కష్టమైపోతాయి. పైగా కరోనా వల్ల రెండేళ్ల విలువైన కాలంలో ప్రభాస్ డేట్స్ చాలా వృధా అయ్యాయి. రాధే శ్యామ్ ఇప్పటిదాకా పూర్తివలేదు.దాంతో ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కష్టమని ప్రభాస్ చెప్పినట్లు సమాచారం.
ఇక ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో మొదలు కాబోతుంది. ఇప్పటికే గోదావరి ఖని బొగ్గు గనుల్లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సలార్.. ఇకపై ఫిలిం సిటీలోని స్పెషల్ సెట్ లో మొదలు కాబోతుంది. “కేజీఎఫ్” చిత్రాలకు తనతో వర్క్ చేసిన టెక్నీషియన్లనే ఆయన ప్రభాస్ సినిమాకి కూడా రిపీట్ చేస్తున్నాడు.
“కేజీఎఫ్” సినిమాకి టెర్రిఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రవి బస్రుర్ కే ప్రభాస్ సినిమాకి బాధ్యతలు అప్పగించాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే సినిమాకి సంబందించిన మ్యూజిక్ వర్క్ మొదలుపెట్టేసారట. అలాగే ఈ సినిమాకి కెమెరా మేన్ కూడా “కేజీఎఫ్”కి వర్క్ చేసిన భువన్ గౌడ పని చేయనున్నాడు. హీరోయిన్, ఇతర నటులు తప్ప… మిగతా టీం అంతా ప్రశాంత్ నీల్ తో తొలినుంచి పనిచేస్తున్నవారే ఉంటారని చెప్తున్నారు.
ఇక ఈ సినిమా టైటిల్ అర్ధం దర్శకుడు నీల్ రివీల్ చేసారు. సలార్ అంటే ఒక రాజుకు రైట్ హ్యాండ్ అని చెప్పాడు. ‘మోస్ట్ వయోలెంట్ మ్యాన్.. కాల్డ్ వన్ మ్యాన్... ది మోస్ట్ వయోలెంట్.. సినిమా మీద ప్రేమతో భాషల హద్దులను చెరిపేస్తూ.. భారతీయ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం.. ప్రభాస్ గారికి హృదయపూర్వక స్వాగతం’ అంటూ ప్రశాంత్ నీల్ పోస్టులో పేర్కొన్నారు. హొంబెల్ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2ను నిర్మించిన విజయ్ కిరుగందుర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ వెనుక ఉన్న హోంబాలే చిత్రాలు ఈ చిత్రాన్ని బ్యాంక్రోలింగ్ చేస్తున్నాయి.