దాదాపు 15+ సినిమాలు పైగా తమ విడుదల తేదీలను ముందుకు వెనక్కి జపురుకోవాల్సిన పరిస్దితి..ఇది ట్రేడ్ మొత్తాన్ని ఇబ్బందుల్లోకి తోసేస్తుంది.


 ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం ‘సలార్’ (Salaar) అనుకున్న తేదీకి విడుదల కావడం లేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ ఎనౌన్సమెంట్ లేకపోయినా ‘సలార్’ వాయిదా పడడం పక్కా అనే వార్త ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఓ మామూలు సినిమా వాయిదా పడితే సమస్య రాదు కానీ ప్రభాస్ వంటి స్టార్ సినిమా వాయిదా పడితే మాత్రం మళ్లీ రిలీజ్ డేట్ కోసం తడుముకోవాలి. అంతేకాదు ఆ కొత్త రిలీజ్ డేట్ సెట్ అవ్వటం చాలా సినిమాలు తమ తేదీలు మార్పు చేసుకోవాలి. ఈ సినిమా అక్టోబర్ కు కానీ నవంబర్ కి కానీ వాయిదా పడితే దాదాపు 15+ సినిమాలు పైగా తమ విడుదల తేదీలను ముందుకు వెనక్కి జపురుకోవాల్సిన పరిస్దితి..ఇది ట్రేడ్ మొత్తాన్ని ఇబ్బందుల్లోకి తోసేస్తుంది.

ఇక సంక్రాంతికి కనుక సలార్ వస్తే కనుక..నాగార్జున #NaaSaamiRanga,విజయ్ దేవరకొండ #Vd13 (#FamilyStar) సినిమాలు మాత్రమే కాకుండా మహేష్ బాబు #GunturKaaram, ప్రశాంత్ వర్మ #Hanuman, రవితేజ #Eagle వంటి ఎప్పుడో సంక్రాంతి బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న సినిమాలకు సైతం థియేటర్స్ సమస్య వస్తాయి. దాంతో ఎవరు కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్తారు..ఎవరు వెనక్కి వెళ్తారనేది పెద్ద సమస్యగా మారుతుంది. 



మరోవైపు విదేశాల్లో ‘సలార్‌’ (Salaar) టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 5లక్షలకు పైగా టికెట్స్‌ అమ్ముడయ్యాయని అక్కడి డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ అధికారికంగా తెలిపింది. దీంతో ఈ చిత్రం ఓవర్సీస్‌లోనూ భారీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఈ స్థాయిలో ఏ సినిమా టికెట్స్ కొనుగోలు కాలేదని ఆ సంస్థ వెల్లడించింది. ఈ పోస్ట్‌తో అందరికి ‘సలార్‌’పై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక ఇందులో యాక్షన్‌ సన్నివేశాలు అంచనాలకు మించి ఉంటాయని నిర్మాతలు గతంలోనే తెలిపిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ (Shruti Haasan) నటించింది.

ఇక సలార్ లో యాక్షన్‌ సన్నివేశాలు అంచనాలకు మించి ఉంటాయని నిర్మాతలు గతంలోనే తెలిపిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ (Shruti Haasan) నటించింది. ‘సలార్’ మూవీపై దేశ వ్యాప్తంగా విపరీతమైన బజ్ ఉంది. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా తొలి భాగం ‘సలార్: సీస్‌ఫైర్’‌ను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఇప్పటికే ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రం అనుకున్న తేదీకి విడుదలైపోతుందని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అయితే, ఇప్పుడు వాళ్ల ఆశలపై నీల్లు చల్లుతూ.. ఈ సినిమా వాయిదా పడిందనే వార్త వచ్చింది.