Asianet News TeluguAsianet News Telugu

#Salaar ఓటిటి రైట్స్ ఫైనల్, ఎవరికి, ఎంతకి?

సలార్ మూవీ  దేశవ్యాప్తంగా రిలీజ్ ముందే సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే.   కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్లు అందించిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు

Prabhas  #Salaar  Post Ott Digital Rights Reportedly Begged Netflix jsp
Author
First Published Sep 13, 2023, 11:49 AM IST


'కెజియఫ్ 2' తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సలార్'.  ఈ సినిమాని సైతం 'కెజియఫ్' తరహాలో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కెజియఫ్', 'కెజియఫ్ 2' నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాను కూడా నిర్మిస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మాత. ఇందులో ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు. జర్నలిస్ట్ ఆద్య పాత్రను ఆమె పోషిస్తున్నారు.  ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  సలార్ పార్ట్ 1: సీజ్‍‍ఫైర్ సినిమా కోసం సినీ ప్రేక్షకులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో  సలార్ పార్ట్ 1: సీజ్‍‍ఫైర్ కలెక్షన్ల సునామీ సృష్టించటం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. కాగా, తాజాగా ఈ చిత్రం డిజిటల్ హక్కుల డీల్ ఫైనల్ అయ్యినట్లు సమాచారం. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. సలార్ మూవీ పోస్ట్ థియేట్రికల్ డిజిటల్  రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుంది.  ఈ మేరకు రీసెంట్ గా ఎగ్రిమెంట్ జరిగింది. దాని ప్రకారం  థియేటర్ రన్ పూర్తయ్యాక సలార్  సినిమాను తమ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ చేసుకునేందుకు మేకర్స్‌తో నెట్‍ఫ్లిక్స్ డీల్ కుదుర్చుకుంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం నెట్‍ఫ్లిక్స్  భారీ మొత్తంతో పోటీపడింది. అమేజాన్ ప్రైన్ ,సోనీ లివ్ కూడా పోటీ పడ్డారని, కానీ నెట్ ప్లిక్స్ రికార్డుస్థాయిలో చెల్లించేందుకు అంగీకరించి ఓకే చేసుకుందని టాక్. అందుతున్న సమాచారం మేరకు సుమారు రూ.185 కోట్లుకు ఈ డీల్ జరిగిందని తెలుస్తోంది. అయితే అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. అలాగే ఇది కేవలం పార్ట్ 1 కు మాత్రమేనా లేక రెండు పార్ట్ లకు కలిపా అన్నది తెలియాల్సి ఉంది. 

Prabhas  #Salaar  Post Ott Digital Rights Reportedly Begged Netflix jsp

'సలార్'ను ఈ నెల 28న విడుదల చేయడం కుదరడం లేదని పేర్కొంది.   ''సలార్' సినిమాకు ప్రేక్షకులు ఎంతగానో మద్దతు అందిస్తున్నారు. అందుకు గాను వాళ్ళకు థాంక్స్. అయితే... అనివార్య కారణాల వల్ల ముందుగా అనుకున్న విడుదల తేదీ సెప్టెంబర్ 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేక పోతున్నాం. విడుదల ఆలస్యం అవుతుంది. థియేటర్లలో ప్రేక్షకులకు అసాధారణ, అత్యున్నత సినిమాటిక్ అనుభూతి ఇవ్వడానికి మేం తీవ్రంగా శ్రమిస్తున్నాం. అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నాం. దయచేసి అర్థం చేసుకోండి! ప్రస్తుతం 'సలార్ 1'కు తుది మెరుగులు దిద్దుతున్నాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో మాకు తోడుగా ఉన్నందుకు థాంక్స్. త్వరలో కొత్త విడుదల తేదీ అనౌన్స్ చేస్తాం'' అని హోంబలే ఫిల్మ్స్ సంస్థ సోషల్ మీడియాలో పేర్కొంది.
 
హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్.. ‘సలార్ పార్ట్ 1: సీజ్‍‍ఫైర్’ సినిమాను ప్రొడ్యూజ్ చేస్తున్నారు. రవిబస్రూర్ సంగీతం అందించగా.. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేశారు.  ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు. వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.

Follow Us:
Download App:
  • android
  • ios