రామాయణం ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ విడుదలయ్యే వరకు ‘సలార్’ మూవీ అప్‌డేట్స్ ఉండవని తాజా సమాచారం.


ప్రభాస్ వంటి టాప్ స్టార్స్ కొన్ని విషయాలలో క్లియర్ గా లేకపోతే మార్కెట్ పరంగా ఇబ్బందులు ఎదురౌతాయి. అందుకే ఆచి,తూచి అడుగులు వేస్తారు. తను చేస్తున్న సినిమాలు విషయంలో ఒక దానికి మరొకటి అడ్డం పడకుండా ఉండాలని ప్రభాస్ భావించారు. అందులో భాగంగా...తన నిర్మాతలతో మాట్లాడుతున్నారు. 

వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం ప్రభాస్‌(Prabhas) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలు ఆదిపురుష్(Adipurush)‌, సలార్(Salaar)‌. ఆదిపురుష్‌ సినిమాను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు ఓంరౌత్‌(Om Raut) ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు విడుదలైన ఈ సినిమా టీజర్‌ కొందరిని నిరాశ పరచడంతో చిత్రబృందం ఈ చిత్రాన్ని మెరుగ్గా తీర్చిదిద్దడం కోసం మరికొంత సమయం తీసుకోనుంది. ఆ కారణంతోనే ఈ సినిమా విడుదలను ఈ ఏడాది జూన్‌కు వాయిదా వేశారు. అయితే మరో ప్రక్క సలార్ రెడీ అయ్యిపోతోంది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. కోఆ చిత్రం టీజర్ విడుదల కు ప్లాన్ చేస్తున్నారు. సలార్ టీజర్ వస్తే ...ఆది పురుష్ పై దృష్టి ప్రక్కకు వెళ్లిపోతుంది. దాంతో ఈ చిత్రం అప్డేట్స్ ఏమీ వదల వద్దని ప్రభాస్ సూచించారని తెలుస్తోంది. 

దాంతో శివరాత్రి పర్వదినాల్లో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌, గ్లింప్స్‌ వస్తాయని ఫ్యాన్స్‌ ఎదురుచూసి ఎలాంటి అప్‌డేట్‌ రాదు అని తేలిపోయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట ఏమీ రాకపోవడానికి కారణం హీరో ప్రభాస్‌ సూచనలే కావటంతో సలార్ టీమ్ పై ఒత్తిడి తేవటం లేదు. కాబట్టి రామాయణం ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ విడుదలయ్యే వరకు ‘సలార్’ మూవీ అప్‌డేట్స్ ఉండవని తాజా సమాచారం.

ఇదిలా ఉంటే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను మరో వార్త కలవరపెడుతోంది. సలార్‌ చిత్రం కూడా వాయిదా పడనుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక సలార్‌ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని చిత్ర టీమ్ గతంలో ప్రకటించింది. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌వి కావడంతో విడుదల ఆలస్యం అయినా.. అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.