Asianet News TeluguAsianet News Telugu

పాన్‌ ఇండియా సినిమాకి సరికొత్త అర్థం ఇవ్వబోతున్న ప్రభాస్‌ `సలార్‌`..ట్రెండ్‌ సెట్టర్‌

ఇప్పుడు `కేజీఎఫ్‌` డైరెక్టర్‌తో మరో పాన్‌ ఇండియా సినిమా `సలార్‌`కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. `కేజీఎఫ్‌`తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాతో పాన్‌ ఇండియాకి సరికొత్త అర్థాన్ని ఇవ్వబోతున్నారు ప్రభాస్‌. 

prabhas salaar movie will give another meaning of fan india arj
Author
Hyderabad, First Published Dec 3, 2020, 9:42 AM IST

ప్రభాస్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ భారీ సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఓ వైపు ఇండియన్‌ మేకర్స్ కి, మరోవైపు స్టార్ హీరోలకు షాక్‌ ల మీద షాక్‌ లు ఇస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. ఇప్పుడు `కేజీఎఫ్‌` డైరెక్టర్‌తో మరో పాన్‌ ఇండియా సినిమా `సలార్‌`కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. `కేజీఎఫ్‌`తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు. 

ఈ సినిమాతో పాన్‌ ఇండియాకి సరికొత్త అర్థాన్ని ఇవ్వబోతున్నారు ప్రభాస్‌. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్‌ కిరంగుదూర్‌ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే దీన్ని భారత్‌లోని అన్ని భాషల్లో తెరకెక్కించబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఇలా జరిగితే భారత్‌లోని అన్ని భాషల్లో రూపొందే తొలి సినిమా, ఏకైక సినిమాగా `సలార్‌` నిలవబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇది జనవరిలో షూటింగ్‌ ప్రారంభం కానుందట. ఇలా పాన్‌ ఇండియా సినిమా అనే పదానికి సరికొత్త అర్థాన్ని ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు. అంతేకాదు దీన్ని `ఆదిపురుష్‌` తర్వాత విడుదల చేయాలని భావిస్తున్నారు. అంతే నాగ్‌ అశ్విన్‌తో సినిమా మరింత డిలే అయ్యే ఛాన్స్ ఉంది. 

ఇదిలా ఉంటే మరో నాలుగేళ్ళు నన్నెవరూ టచ్‌ చేయలేరనేంతగా ప్రభాస్‌ ఈ నాలుగు భారీ సినిమాలకు సైన్‌చేశారని అర్థమవుతుంది. అంతేకాదు ఈ చిత్రాలతో ప్రభాస్‌ అంతర్జాతీయ స్థాయి యాక్టర్‌గా, ప్రపంచ సినిమా చరిత్రలోనే అతి పెద్ద స్టార్‌గా అవతరించినా ఆశ్చర్యం లేదనేంతగా ఆయన ఎదిగిపోతాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆయా సినిమాల విజయాలపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది. 

ప్రస్తుతం ప్రభాస్‌ `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌తో ఓ సైన్స్ ఫిక్షన్‌ చేస్తున్నారు. దీంతోపాటు బాలీవుడ్‌లో డైరెక్ట్ సినిమాని ఓం రౌత్‌తో చేస్తున్నారు. దీనికి `అవతార్‌` చిత్రానికి పనిచేసిన వీఎఫ్‌ఎక్స్ సంస్థ పనిచేస్తుందని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios