యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై ప్రస్తుతం వేల కోట్ల బిజినెస్ జరుగుతోంది. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై ప్రస్తుతం వేల కోట్ల బిజినెస్ జరుగుతోంది. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. జూన్ లో ఆదిపురుష్ రిలీజ్ అవుతుండగా..సెప్టెంబర్ లో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ రిలీజ్ కి రెడీ అవుతోంది. 

ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రాజెక్ట్ కె ని దించుతున్నారు. ఈ మూడు చిత్రాలు బిజినెస్ లెక్క వేల కోట్లు దాటుతోంది. టీజర్ విడుదలైనప్పుడు ఆదిపురుష్ చిత్రం విమర్శలు మూటగట్టుకుంది. కానీ ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మాత్రం మంచి రెస్పాన్స్ దక్కింది. 

అయితే ఇదిలా ఉండగా సలార్ చిత్రం రిలీజ్ వాయిదా పడుతోంది అంటూ రూమర్స్ వచ్చాయి. సెప్టెంబర్ 28న ఈ చిత్ర రిలీజ్ డేట్ ముందుగా నిర్ణయించారు. కానీ షూటింగ్ డిలే అవుతుండడంతో మూవీ కూడా వాయిదా పడుతోంది అని రూమర్స్ వచ్చాయి. 

తాజాగా చిత్ర యూనిట్ ఆ రూమర్స్ ని కొట్టి పారేస్తూ రిలీజ్ డేట్ ని మరోసారి కంఫర్మ్ చేసింది. ఎట్టి పరిస్థితిల్లో సలార్ సెప్టెంబర్ 28నే రిలీజ్ అవుతుందని తెలిపారు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. ఆదిపురుష్ తో రాముడిగా అలరించబోతున్న ప్రభాస్ ఆ చిత్రం విడుదలైన రెండు మూడు నెలల్లోనే యాక్షన్ ఫీస్ట్ తో రంగంలోకి దిగుతాడు. కెజిఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.