ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ రెడీ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సలార్ సినిమాను కెజిఫ్ ను మించి రెడీ చేస్తున్నాడు. ఇందులో భాగంగా.. క్లైమాక్స్ ను సర్ ప్రైజింగ్ గా తెరకెక్కిస్తున్నాడు స్టార్ డైరెక్టర్. 

ఎప్పుడెప్పుడా అని సలార్ కోసం ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. యంగ్ రెబల్ స్టార్ ను మరోసారి మాస్ యాక్షన్ హీరోగా చూడాలని ఉర్రూతలూగుతున్నారు. రాధేశ్యామ్ లో ప్రేమికుడిగా ప్రభాసను రిసీవ్ చేసుకోలేకపోయారు ఫ్యాన్స్. దాంతో మరోసారి మాస్ యాక్షన్ ట్రీట్ టో.. ఫుల్ మీల్స్ తినాలని ఆకలితో ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను రెడీ చేస్తున్నాడు. అభిమానులంతా సలార్ కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. 

అయితే అభిమానుల ఆకాంక్షలకు అనుగూణంగా తెరకెక్కుతున్న సలార్ షూటింగ్ కు ఆమధ్య కాస్త గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు రీ స్టార్ట్ చేసి.. సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈమూవీ నుంచి ఏదో ఇక అప్ డేట్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు. ఇక సలార్ గురించి ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమూవీ షూటింగ్ అంతా దాదాపు అయిపోయినట్టే.. ఇక క్లైమాక్స్ సీన్ మాత్రమే పెండింగ్ ఉన్నట్టు సమాచారం. ఈ క్లైమాక్స్ సీన్ నే చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్.

సలార్ క్లైమాక్స్ కోసం గట్టిగానే సన్నాహాలు చేస్తున్నారు ప్రశాంత్ నీల్ టీమ్. ఈ క్లైమాక్స్ ను దాదాపు 400 మందితో చేయబోతున్నారట. అంత మందితో క్లైమాక్స్ సీన్ అంటే.. ఆ యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ.. ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కెజియఫ్ ను మించి పతాక సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు. ఇక ఈరేంజ్ అంటే ప్రభాస్ ఆలిండియా ఫ్యాన్స్ పండగ చేసుకున్నట్టే అని తెలుస్తోంది. 

ఇక ఈ భారీ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారు టీమ్. ఈసినిమా బ్లాక్ బస్టర్ అయితే.. ప్రభాస్ ధాటిని తట్టుకోవడం ఏ హీరోకు సాధ్యం కాదు అనే చెప్పాలి. ఇక ప్రశాంత్ నీల్ కూడా పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారడం ఖాయం . అంతే కాదు ఈమూవీ సక్సెస్ తో.. ప్రశాంత్ నీల్ నెక్ట్స్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరుగుతాయి. తారక్ తో ప్రశాంత్ నీల్ సినిమా 2024 మార్చ్ లో స్టార్ట్ కాబోతోంది.