Asianet News Telugu

‘సలార్’ డీల్...అంత తక్కువా? నమ్మమంటున్న ఫ్యాన్స్

 ఈ సినిమా అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కుల కోసం రూ. 100 కోట్లకు ప్రైమ్ ఆఫర్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే విషయమై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Prabhas Salaar Makers Get Fancy Deal From Amazon Prime Video  jsp
Author
Hyderabad, First Published Jun 21, 2021, 8:05 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మీడియాలో వార్త వస్తే ..సోషల్ మీడియాలో రచ్చ మొదలు అవుతుంది. ముఖ్యంగా స్టార్ సినిమాల చుట్టూ రకరకాల కథనాలు ప్రచారం జరుగుతూంటాయి. వాటిని ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే...యాంటి ప్యాన్స్ ఎత్తి చూపుతూంటారు. తాజాగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాకు చెందిన డీల్  గురించి డిస్కషన్ జరుగుతోంది.

వాస్తవానికి ‘సలార్’ పై భారీ అంచనాలు వున్నాయి.  కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే షూటింగ్‌లకు అనుమతి వచ్చే ఛాన్స్ ఉండటంతో సలార్‌ టీమ్ రెడీ అవుతోంది. అయితే పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ సినిమాలపై రూమర్స్ ఎక్కువే ఉంటున్నాయి. తాజాగా సలార్ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తంలో ఆఫర్ చేసారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కుల కోసం రూ. 100 కోట్లకు ప్రైమ్ ఆఫర్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే విషయమై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంత తక్కువ మొత్తానికి అమేజాన్ కు ఎందుకు ఇస్తారని అంటున్నారు. సలార్ సినిమాకు మేకింగ్ ఖర్చు 100 కోట్లకు పైనే అవుతుందంటున్నారు. అదే సమయంలో ప్రభాస్ రెమ్యునరేషన్ సైతం 100 కోట్లకు దగ్గరలో ఉందని, ఆయన రెమ్యునేషన్ కి కూడా అమేజాన్ వాళ్లు ఇచ్చే మొత్తం సరిపోవని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటిది అమెజాన్ ప్రైమ్ 300 కోట్ల మేర ఆఫర్ చేసిన ఆలోచించే ప్రసక్తే లేదని  సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే మిగతా హీరోల ఫ్యాన్స్ ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. వంద కోట్లు అనేది మామూలు మొత్తం కాదని, థియోటర్ రిలీజ్ కాకుండా రైట్స్ మొత్తం అమేజాన్ కు ఇచ్చేస్తే అప్పుడు ఆలోచించాలి అంటున్నారు. అయితే ఇంకా డీల్ క్లోజ్ అవ్వలేదట.
 
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు తెగ పోటీ పడుతున్నారు.  ప్రభాస్‌ ‘సలార్‌’ మొదలై...ఫ్యాన్స్ కు పండగ చేసింది. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ కు ఇది నెక్ట్స్ లెవిల్ ఫిల్మ్‌.  హొంబెల్‌ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. కేజీఎఫ్‌,  కేజీఎఫ్‌ 2ను నిర్మించిన విజయ్‌ కిరుగందుర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ వెనుక ఉన్న హోంబాలే చిత్రాలు ఈ చిత్రాన్ని బ్యాంక్రోలింగ్ చేస్తున్నాయి.
  

Follow Us:
Download App:
  • android
  • ios