సలర్ సినిమాలో దొరసాని గుర్తుందికదా.. ఆమె షాకింగ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖం నిండా గాయాలతో ఆమె రూపం చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. కారణం ఏంటంటే..?
సలార్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే. చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం చూస్తున్న ప్రభాస్ కు పండగలా సలార్ మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేసింది సినిమా. గతేడాది చివర్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. వరుస ప్లాపుల్లో ఉన్న ప్రభాస్ కి ఈ మూవీ కొంత రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ ను చూసి ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చాయి అంటే.. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ రేంజ్లో ఎలివేట్ చేశాడో అర్ధం అవుతోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కాటేరమ్మ ఫైట్ వద్దన్నా... గూజ్ బంప్స్ తెప్పిస్తుంది.
ఇక ఇక్కడ విషయం ఏంటీ అంటే.. ఈ ఫైట్ లో విలన్ పక్కన ఉండే ఆంటీ అందరికీ గుర్తుండే ఉంటుంది.రెండు నిమిషాలు బావా దొరసానిలా తయారుచేస్తాను’ అంటూ ఆమె డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. అయితే ఆమెకు క్లైమాక్స్ లో ప్రభాస్ కౌంటర్ కూడా ఇస్తాడు.. చివర్లో ‘రెండు నిమిషాలు దొరలా తయారుచేస్తా’ అంటూ ప్రభాస్ కౌంటర్ కూడా అదిరిపోుతుంది. ఆ ఒక్క డైలాగ్ తో ఆమె బాగా పాపులర్ అయిపోయింది. ఇంతకీ ఆమె ఎవరు అంటే.. ఆమె పేరు పూజ విశ్వేశ్వర్.ఈమె తెలుగు నటి.
సలార్ వల్ల ఫేమస్ అయిన పూజా.. సలార్ కి ముందు కూడా పలు సినిమాల్లో నటించింది. కాని అవేమి ఆమెకు పేరు తీసుకురాలేదు. ఈసినిమాతో బాగా పేమస్ అయ్యింది పూజా విశ్వేశ్వర్. అయితే తాజాగా ఆమె ముఖంనిండా గాయాలతో కనిపించడం అందరిని షాక్ కు గురి చేస్తోంది. అయితే ఈమె యాక్సిడెంట్ అయ్యిందని అంటున్నారు. విషయం ఏంటి అంటే.. పూజా విశ్వేశ్వర్ బైక్ పై వైజాగ్ లోని అనకాపల్లి హైవేలో వెళ్తుండగా పొరపాటున డివైడర్ ను ఢీ కొట్టి కిందపడిపోయింది.
ఈ క్రమంలో ఆమె ముఖానికి గాయాలు అయ్యాయి. ముఖ్యంగా ఓ కన్ను భాగం వద్ద గట్టిగా గాయం అయ్యింది అని తెలుస్తుంది. ఈమె హాస్పిటల్ బెడ్ పై ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దాంతో ఆమెకు ఏమయ్యిందని ఆరాతీస్తున్నారు నెటిజన్లు. పూజాకు దెబ్బలు గట్టిగానే తగిలినట్టు తెలుస్తోంది. మరి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది.
