బాహుబలి సిరీస్ తో గ్రాండ్ సక్సెస్ సాధించి.. తన రేంజ్ ను అదే స్థాయిలో కంటిన్యూ చేసేందుకు ప్లాన్ చేసుకుని మరీ ప్రభాస్ చేస్తున్న మూవీ సాహో. హైద్రాబాద్ లో కొంత భాగం షూటింగ్ జరపుకోగా.. ఇప్పుడు దుబాయ్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను పిక్చరైజ్ చేస్తున్నారు.

దుబాయ్ ప్రభుత్వం నుంచి స్పెషల్ పర్మిషన్స్ తీసుకుని.. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లను తీసుకొచ్చి మరీ.. ఈ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నారు. బుర్జ్ ఖలీఫా చుట్టూ సాగే ఈ ఛేజింగ్ సీన్.. మూవీకే హైలైట్ అవుతుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండగా.. అన్నిటిలోకి ఇదే టాప్ రేంజ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ దుబాయ్ నుంచి సాహో షూట్ కి సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ఎలాంటి లీకులు లేకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇవి ఎలా బైటకు వచ్చాయని తెగ మథన పడుతున్నారట సాహో టీం. ముఖ్యంగా ప్రభాస్ లుక్ రివీల్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారట.

పైకి ఇలా చెబుతున్నా కానీ.. సాహో కి బజ్ అండ్ బిజినెస్ పెంచడం కోసం.. సినిమా మేకర్సే ఈ ఫోటోలను లీక్ చేశారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఆ వెంటనే దుబాయ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా.. అక్కడి ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎపిసోడ్ గానే చెబుతున్నారు. ఇలాంటివి ఏ మేకర్స్ అయినా చెప్పరు.. ఒప్పుకోరు కానీ.. ఇకపై అయినా లీకులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు సాహో టీం.