ప్రభాస్ తదుపరి చిత్రం సాహో సాహోలో హీరోయిన్ కోసం వేట శ్రద్ధ కపూర్, దిశా పటానిలను వద్దనుకున్న టీమ్ కత్రీనా కైఫ్, దీపికా పడుకొనేల మధ్య పోటీ

బాహుబలి2 సంచలన విజయం తర్వాత హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఇప్పటికే బాహుబలి సినిమా రిలీజ్ తో పాటు విడుదలైన సాహో టీజర్ భారీ హైప్ క్రియేట్ చేసింది. బాహుబలితో బాలీవుడ్ కూడా ప్రభాస్ వెంట పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక సాహో టీజర్ కూడా ఒక రేంజ్ లో ఉండటంతో భారీ హైప్ క్రియేట్ అయింది. బాహుబలి కోసం ఐదేళ్ళు అంకితమైన ప్రభాస్ దాని తర్వాత సుజిత్ రెడ్డి దర్శకత్వంలో సాహో చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ హైరేంజ్ యాక్షన్ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

సాహో చిత్రం కోసం పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే ఈ సినిమా కోసం సంప్రదించిన వారిలో శ్రద్ధాకపూర్, దిశాపటానీ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. సాహో చిత్రం కోసం సంప్రదించిన హీరోయిన్లలో శ్రద్ధాకపూర్, దిశా పటానీ ఉన్నారు. కానీ వారిద్దరూ ఊహించని విధంగా రెమ్యూనరేషన్ అడగడంతో సాహో టీమ్ వాళ్లిద్దరినీ పక్కన బెట్టినట్టు తెలుస్తోంది.

సాహోలో నటించేందుకు శ్రద్ధాకపూర్ రూ.8 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. “సాహో చిత్రం కోసం ప్రభాస్ పక్కన శ్రద్ధాకపూర్‌ను తీసుకోవాలనేది మా మొదటి ఛాయిస్. ఆమెకు కథ కూడా చెప్పాం. కథ వినేటప్పుడు ఎగ్జయిట్ అయిన శ్రధ్దా ఎగిరి గంతులేసింది. అయితే చిత్రంలో నటించేందుకు రూ.8 కోట్లు డిమాండ్ చేసింది. దాంతో మేము షాక్ తిన్నాం. టాలీవుడ్‌లో ఏ నటికీ అంత చెల్లించిన దాఖలాలు లేవు అని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. తనకు కథ నచ్చిందని... ఈ చిత్రం చేయడానికి చాలా ఆసక్తితో ఉన్నానని.. బాహుబలి2 తర్వాత ప్రభాస్‌తో నటించడానికి చాలా ఉత్సాహంతో ఉన్నాననీ.. కానీ రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం మార్పు ఉండదని శ్రద్ధాకపూర్ చెప్పిందని సమాచారం.

ఇక బాలీవుడ్ హాట్ ఫిగర్ దిశాపటానీ... పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ చిత్రంలో వరుణ్ తేజ్ పక్కన నటించింది. సాహో చిత్రంలో నటించడానికి అడగ్గానే ఓకే చెప్పిందట. కానీ ఈ గ్లామర్ డాల్ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ విని నిర్మాతలు ఖంగు తిన్నారట. ప్రభాస్ పక్కన నటించడానికి దిశాపటానీ రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. దిశాపటానీ తెలుగు సినిమాతోనే కెరీర్ ప్రారంభించడంతో ఆమె ఈ చిత్రంలో నటిస్తుందనే ఆసక్తితో సంప్రదించామని.. అయితే దిశా సిబ్బంది మాతో మాట్లాడినప్పుడు... దిశాకు స్క్రిప్ట్ నచ్చిందని, కానీ రెమ్యూనరేషన్ రూ.5 కోట్లు ఇవ్వాలని అన్నారు. దాంతో మేమే షాక్ తిన్నాం. అని చిత్ర యూనిట్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

ఇక ఇప్పటికే నిర్వహించిన సర్వేలో కత్రినా, దీపికా పడుకునేలు ప్రభాస్ హీరోయిన్లుగా టాప్ రేసులో నిలవగా.. కత్రినా ప్రత్యర్థి దీపికాకన్నా మరింత ఆదరణతో ప్రభాస్ హీరోయిన్ గా టాప్ మార్క్స్ సాధించింది. పైగా తాజాగా కత్రినా కైఫ్ ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తితో ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. కత్రినా డేట్స్ కూడా అడ్జస్ట్ కావడంతో ఆమెను తీసుకోవటం ఖాయమైందని తెలుస్తోంది. అయితే అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.