యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆగష్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుగుతోంది.  ఈ చిత్రంలో ప్రభాస్ కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నాడు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ఆధ్వర్యంలో సాహో యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. 

బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. సాహో చిత్రంపై నెలకొని ఉన్న అంచనాల కారణంగా అనేక రికార్డులు నెలకొల్పే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. సాహో చిత్రం రిలీజ్ విషయంలో బాహుబలి 2 రికార్డునే చెరిపివేసేందుకు సిద్ధం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. 

సాహో చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 10000 స్క్రీన్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషలతో పాటు జపాన్, చైనాలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 9 వేల స్క్రీన్స్ లో విడుదలయింది. సాహో చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.