బాహుబలి తరువాత తెలుగు ఆడియెన్స్ ని మెప్పించడంలో విఫలమైన రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఆడియెన్స్ ని మాత్రం బాగానే మెప్పించాడు. ఎవరు ఊహించని విధంగా హిందీలో సాహో పాజిటివ్ టాక్ ను అందుకుంది. అలాగే సినిమా కలెక్షన్స్ తో కూడా బాలీవుడ్ ఎనలిస్ట్ లకు షాకిచ్చింది. 

రివ్యూలు సినిమాకు అనుకున్నంతగా రాకపోయినప్పటికీ కలెక్షన్స్ లో మాత్రం సినిమా హడావుడి తగ్గలేదు. మెయిన్ గా మాస్ ఏరియాల్లో సినిమా మంచి లాభాలను అందించింది. ఇక నెంబర్స్ విషయానికి వస్తే.. రీసెంట్ గా సినిమా 153కోట్ల కలెక్షన్స్ ని అందుకున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ ని రిలీజ్ చేసింది. బాహుబలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ హిందీ ఆడియెన్స్ ని సాహో తో మరోసారి మెప్పించాడు. 

ఇక తన నెక్స్ట్ సినిమాలన్నీ బాలీవుడ్ లో రిలీజ్ చేయాలనీ ప్రభాస్ డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం రాధాకృష్ణ సినిమా కోసం ప్రభాస్ సిద్దమవుతున్నాడు. లుక్స్ నుంచి ఫిట్ నెస్ వరకు అన్ని విషయాల్లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ లో ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.