Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్-నాగ్‌ అశ్విన్‌ పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ – కె’ ప్రారంభం

గురు పౌర్ణమి పర్వదినాన ఇండియన్ సినిమా గురు అమితాబ్‌తో షూటింగ్ స్టార్ట్ చేశామని చెబుతూ, రెబల్ స్టార్ ప్రభాస్ క్లాప్ ఇస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది టీమ్.  

Prabhas s sci-fi film tentatively titled Project K jsp
Author
Hyderabad, First Published Jul 24, 2021, 2:16 PM IST

  ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న  పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ప్రారంభమైంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘ప్రాజెక్ట్‌ కే’ అనే వర్కింగ్‌ టైటిల్‌ ఫిక్స్ చేశారు. గురు పూర్ణిమ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ వేడుకలో ప్రభాస్‌తోపాటు బీటౌన్‌ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కూడా పాల్గొన్నారు. ముహూర్తపు షాట్‌కి ప్రభాస్‌ క్లాప్‌ కొట్టారు. ఇందులో భాగంగా బిగ్‌బీపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఓ ఫొటో షేర్‌ చేసింది.

గురు పౌర్ణమి పర్వదినాన ఇండియన్ సినిమా గురు అమితాబ్‌తో షూటింగ్ స్టార్ట్ చేశామని చెబుతూ, రెబల్ స్టార్ ప్రభాస్ క్లాప్ ఇస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది టీమ్. ప్రస్తుతం అమితాబ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఈ సినిమాకు స్క్రిప్ట్ మెంటార్‌గా పనిచేస్తుండడం విశేషం.

పాన్‌ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమాలో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఇందులో అమితాబ్‌ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ నిర్మిస్తోంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రీన్‌ప్లే పర్యవేక్షణ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios