ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై  రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.  ఈ నేపధ్యంలో ప్రభాస్.. సర్‌ఫ్రైజ్ ఇస్తానంటూ ఒకరోజు ముందే చెప్పి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మంగళవారం నాడు ఓ కొత్త రిలీజ్  పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ చూసిన ఫ్యాన్స్, సినీ లవర్స్, నటీ నటులు ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.  అదే సమయంలో  ఆ పోస్టర్ హాలీవుడ్‌ నుంచి లిప్ట్ చేసారని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. 

పాపులర్ టీవీ సీరిస్ ‘బ్రేకింగ్ బ్యాడ్’ పోస్టర్ లాగా , అలాగే హాలీవుడ్ చిత్రం హ్యంకాక్ లో పోస్టర్  తరహాలో ఉందంటూ రెండు పక్కపక్కనే పెట్టి మరీ పోలిక తేవడం సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.  ఇది ప్రభాస్ అభిమానులకు సహజంగానే కోపం తెప్పిస్తోంది.  అయితే ఆ సినిమా అల్లాటప్పాది అయితే అయితే అసలు పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా ఇది.

ఈ చిత్రం కోసం  అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. విదేశాల్లో యాక్షన్‌ సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్‌స్టైలిష్‌గా, ఇదివరకటి కంటే భిన్నంగా తెరపై సందడి చేయబోతున్నారు. బాలీవుడ్‌ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, జాకీఫ్రాఫ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

బాలీవుడ్‌ భామ శ్రద్ధాకపూర్‌ ఇందులో ప్రభాస్‌ సరసన నటిస్తున్నారు. సుజీత్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.