Asianet News TeluguAsianet News Telugu

మేజర్ సర్జరీ పూర్తి చేసుకున్న ప్రభాస్, యూరప్ నుంచి ఎప్పుడు వస్తున్నాడంటే..?

చాలాకాలంగా యూరప్ లో ఉన్న ప్రభాస్.. ఇండియాకు రాబోతున్నాడట. దాదాపు నెలరోజుల తరువాత ఆయన ఇండియాలో అడుగు పెట్టబోతున్నారట. 

Prabhas Returning From Europe To Completing His Surgery JMS
Author
First Published Oct 30, 2023, 7:21 PM IST | Last Updated Oct 30, 2023, 7:21 PM IST

చాలా రోజులుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి కనిపించడం లేదు ఇండస్ట్రీలో. ఆయన ఎక్కడికి వెళ్ళాడని వెతుక్కుంటున్నారు జనాలు. ఆకరికి ఆయన బర్త్ డే, దసరా ఫెస్టివల్ రెండూ ఒకేసారి వచ్చేవరకూ..అప్పుడైనా కనిపిస్తాడంటే అదీ లేదు.. అంతే కాదు రిలీజ్ కు రెడీగా ఉన్న సలర్ నుంచి అప్ డేట్ కూడా ఏమీ రాలేదు. దాంతో ప్రభాస్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఫారెన్ లో ఉన్న ప్రభాస్ ఇండియాకు రాబోతున్నాడట. 

ప్రభాస్ యూరప్ వెళ్ళారు.. అయితే ఆయనేమి విహారయాత్రకు వెళ్ళలేదు. ఓ సర్జరీ చేయించుకోవడం కోసం ప్రభాస్ యూరప్ వెళ్ళారు. ప్రభాస్ చాలా కాలంగా కాలు నొప్పితో బాధపడుతున్నాడు. మోకాలి నొప్పి ఎక్కువవ్వడంతో... దానికి సర్జరీ చేయించుకునేందుకు ఆయన యూరప్ వెళ్ళారు. సర్జరీ సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేసుకుని రిటర్న్ కాబోతున్నట్టు తెలుస్తోంది. 

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా నుంచే ఈ  మోకాలి నొప్పితో బాధ పడుతున్నారు. కాని ఆ సినిమా తరువాత వరుస సినిమాల బిజీ షెడ్యూల్స్ వల్ల ఈసమస్యపై దృష్టి పెట్టలేకపోయారు.. మధ్య దాని కోసం తాత్కాలిక చికిత్స తీసుకున్నప్పటికీ.. ప్రభాస్ ఇంకా ఆ నొప్పితో బాధ పడుతూనే ఉన్నాడు. ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ ని ఆ బాధతోనే పూర్తి చేశాడు. అయితే ఆ నొప్పి ఇప్పుడు మరింత ఎక్కువ అవ్వడంతో.. అది పెద్ద సమస్యగా మారిందట. ఇక ఆయన నడవడానికి కూడా బాగా ఇబ్బంది పడ్డాడట. దాంతో ఇక ఈ బాధ భరించడం కష్టం అని నిర్ణయించుకుని.. సలార్ షూటింగ్ అయిపోగానే.. ఆయన యూరప్ ప్లైట్ ఎక్కేశారు. 

సెప్టెంబర్ లో ఈ సర్జరీ కోసం యూరప్ వెళ్లిన ప్రభాస్.. ఆపరేషన్ ని గత నెలలోనే పూర్తి చేసుకున్నాడు. అయితే నెల పాటు విశ్రాంతి అవసరం అవ్వడంతో అక్కడే ఉండి రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ కంప్లీట్ గా రికవరీ అయ్యినట్లు సమాచారం. నవంబర్ 6న హైదరాబాద్ లో ల్యాండ్ అవబోతున్నాడట. ఇక వచ్చిన వెంటనే సలార్ ప్రమోషన్స్ ని ప్లాన్ చేయనున్నాడట. సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని ఇప్పటివరకు మొదలు పెట్టలేదు. దసరాకు, ప్రభాస్ భర్త్ డేకు ఎలాగూ అప్ డేట్ ఇవ్వలేకపోయిరు.. ఇక దివాళికైనా ఏదైనా అప్ డేట్ ఇస్తారా లేదా అనేది చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios