Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ రెమ్యునరేషన్.. ఇంకా మాట్లాడుకోలేదట!

 'సాహో' సినిమాకి ప్రభాస్ ఎంత తీసుకున్నడనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈసినిమా కోసం దాదాపు 350 కోట్ల బడ్జెట్ పెట్టారు. దాని మీద యాభై శాతం అదనంగా బిజినెస్ చేస్తోందంటే దానికి కారణం ప్రభాస్ క్రేజ్ అనే చెప్పాలి. 

prabhas remuneration for saaho
Author
Hyderabad, First Published Aug 14, 2019, 2:36 PM IST

బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ సినిమా విజయంలో రాజమౌళిదే కీలక పాత్ర. దానికి తగ్గట్లే ఆయనరెమ్యునరేషన్ కూడా అందుకున్నాడు. హీరో ప్రభాస్ కూడా సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ సినిమాకి ప్రభాస్ చాలా తక్కువ పారితోషికం తీసుకున్నట్లు రాజమౌళి స్వయంగా చెప్పారు. 

కానీ 'బాహుబలి' కారణంగా ప్రభాస్ రేంజ్ ఎంతగా పెరిగిందో తెలిసిందే. అతడి మార్కెట్ స్థాయి బాగా విస్తరించింది. కాబట్టి పారితోషికం తక్కువ అందుకున్నా పెద్దగా చర్చకు రాలేదు. ఇప్పుడు 'సాహో' సినిమాకి ప్రభాస్ ఎంత తీసుకున్నడనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం దాదాపు 350 కోట్ల బడ్జెట్ పెట్టారు. దాని మీద యాభై శాతం 
అదనంగా బిజినెస్ చేస్తోందంటే దానికి కారణం ప్రభాస్ క్రేజ్ అనే చెప్పాలి.

దర్శకుడు సుజీత్ కి ఒక సినిమా అనుభవం ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో సినిమాపై బడ్జెట్ పెట్టడానికి కారణం కూడా ప్రభాసే.. అతడి పేరు మీదే సినిమా సేల్ అయింది. అలాంటిది ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని ప్రభాస్ వద్ద ప్రస్తావించగా.. సినిమాను నిర్మించింది తన మిత్రులే అని.. తాము రెమ్యునరేషన్ గురించి ఇంకా మాట్లాడలేదని.. అందరి దృష్టి ప్రేక్షకులకు బెస్ట్ క్వాలిటీ అవుట్ పుట్ ఇవ్వడం మీదనే ఉందని చెప్పాడు ప్రభాస్.

సినిమా రిలీజ్ తరువాత రెమ్యునరేషన్ గురించి ఆలోచిస్తామని చెప్పాడు. యువి క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ లాంటిది. కాబట్టి వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటాడేమో!

Follow Us:
Download App:
  • android
  • ios