Asianet News TeluguAsianet News Telugu

Prabhas: ప్రభాస్ రెమ్యునరేషన్ పై రూమర్స్.. మరీ అంత పెంచాడా ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ప్రస్తుతం వేల కోట్లల్లో బిజినెస్ జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. 

Prabhas remuneration became hot topic
Author
Hyderabad, First Published Jun 25, 2022, 9:18 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ప్రస్తుతం వేల కోట్లల్లో బిజినెస్ జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె ఇలా ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ ఆషామాషీ చిత్రాలు కావు. 

ఆది పురుష్ పౌరాణిక చిత్రం కాగా, సలార్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ. ఇక ప్రాజెక్ట్ కె చిత్రం అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న సూపర్ హీరో మూవీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఒక్కో సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్ల వరకు ఉంటోంది. 

తాజా జరుగుతున్న ప్రచారం ప్రకారం ప్రభాస్ తన రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ ఒక్కో చిత్రానికి 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్. పాన్ ఇండియా మూవీస్ అంటే ఎక్కువగా డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. 

ఇక పాన్ ఇండియా చిత్రాలకు హిట్ టాక్ వస్తే దాదాపు 1000 కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 నిరూపించాయి. దీనితో ప్రభాస్ తన రెమ్యునరేషన్ పెంచేసినట్లు టాక్. అదనంగా మరో రూ 20 కోట్లు పెంచాడట. అంటే ప్రభాస్ ఒక్కో చిత్రానికి ప్రస్తుతం డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ రూ 120 కోట్లు. 

ప్రభాస్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీగా ఉంటారు. ప్రభాస్ డేట్స్ దొరికితే చాలు అనుకునే పరిస్థితి నిర్మాతల్లో ఉంది. బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios