నేడు 69వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి దేశమంతా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ మాత్రం స్పెషల్ గా ఒక పోస్టర్ ద్వారా తన విషెష్ ని అందించారు. మోడీ జీవిత ఆధారంగా తెరకెక్కిన `మ‌న్ బైరాగి` అనే సినిమాను తెలుగులో `మ‌నో విరాగి` పేరుతో విడుదల చేయనున్నారు. 

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సమర్పణలో  సంజ‌య్ త్రిపాఠి ద‌ర్శ‌క‌త్వంలో ఈ బ‌యోపిక్‌ రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ సినిమాకు సంబందించిన మొదటి పోస్టర్ ని నేడు విడుదల చేశారు. బాహుబలి ప్రభాస్  పోస్టర్ ని రిలీజ్ చేయగా ఒక్కసారిగా ఆ పోస్టర్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

స్పెషల్ పర్సన్ పై రూపొందుతోన్నస్పెషల్ సినిమా. స్పెష‌ల్ రోజున ఫిలిమ్ మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. హ్యాపీ బ‌ర్త్ డే న‌రేంద్ర‌మోదీగారు. సంజ‌య్ లీలా భ‌న్సాలి, మ‌హావీర్ జైన్ నిర్మిస్తోన `మ‌న్ బైరాగి` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అలాగే మోదీగారి అన్‌టోల్డ్ స్టోరీకి సంజ‌య్ త్రిపాఠి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారని ప్రభాస్ పేర్కొన్నారు.