వరస లైనప్ లో ప్రభాస్ చేస్తున్న ఓ ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమానే "ది రాజా సాబ్". దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా...


ప్రభాస్ కల్కి వచ్చేసింది. 1000 కోట్లు పట్టుకెళ్లిపోయింది. దాంతో ఇప్పుడు అందరి దృష్టీ ప్రబాస్ నెక్ట్స్ సినిమాపైనే ఉంది. ఆ సినిమా మరేదో కాదు రాజా సాబ్ అంటున్నారు. ఎంత త్వరగా రాజా సాబ్ ని బయిటకు వదిలితే అంతలా ఈ సినిమాకు బిజినెస్ జరుగుతుంది. క్యాష్ అవుతుంది. ఈ విషయం నిర్మాత విశ్వప్రసాద్ కు తెలుసు. అందుకే ఈ సినిమా పనులను పరుగెట్టిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు ట్రేడ్ లో వినిపిస్తోంది. 

'ది రాజా సాబ్' సినిమా రిలీజ్ డేట్ పై మీడియాలో చాలా రోజులు నుంచి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీన్ని 2024లోనే వచ్చేస్తుందని, కాదు కాదు 2025లో తీసుకు వస్తారని వినిపించాయి. దీంతో ప్రభాస్ అభిమానులు ఇప్పటికీ ఈ విషయంలో అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా 'ది రాజా సాబ్' రిలీజ్ డేట్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. 

రాజా సాబ్ సినిమాని పండగ సెలబ్రేషన్స్ లో ఆ మూడ్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అంటే మాగ్జిమం డిసెంబర్ 20 లేదా జనవరి మొదటి వారంలో రిలీజ్ ఉంటుందని అంటున్నారు. సినిమా హిట్ అయితే సంక్రాంతికి కూడా క్యాష్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారుట. ఈ లోగా వీలైనన్ని రోజులు కేటాయించి రాజాసాబ్ ని ఫినిష్ చేయాలని ప్రభాస్ చెప్పారట. తను ఇప్పుడు ఇటిలీనుంచి రాగానే కంటిన్యూ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారట. 

ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్.. హీరో తాత పాత్రను చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, ఇందులో ఆ స్టార్ హీరో దెయ్యంగా కనిపిస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో సంజయ్ దత్ పాత్రపై అంచనాలు భారీగా నెలకొన్నాయని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో మరో దెయ్యం కూడా ఉంటుందని ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ కూడా దెయ్యంగా కనిపించబోతుందట. ఇది సినిమాలోనే పెద్ద ట్విస్ట్ అని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. 

ఇక ఆగస్ట్ లో హను రాఘవపూడి చిత్రం కు డేట్స్ ఇవ్వబోతున్నారట. అలాగే ఆ తర్వాత సలార్ 2 కు కూడా డేట్స్ ఇస్తారు. ఇలా వరస పెట్టి ఒక సినిమా తర్వాత మరొకటి ఫినిష్ చేస్తారు. 'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని ఇస్తున్నాడు.