ప్రభాస్ ‘రాధే శ్యామ్‌’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘రాధేశ్యామ్‌’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చాలా కాలం క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం 2020 చివరకు వచ్చినా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. జనవరి 2021లో కొన్ని సీక్వెన్స్ లు తీయటానికి రాధాకృష్ణ ప్లాన్ చేసారు. అయితే సంక్రాంతి రోజున తన నుంచి ఫ్యాన్స్ ఏదో ఒక సర్పైజ్ ఆశిస్తారని ప్రభాస్ భావించి, అందుకు తగ్గ ప్లాన్ చేసారట. అదే తన తాజా చిత్రం రాధేశ్యామ్ టీజర్. షూటింగ్ తర్వాత పెట్టుకోవచ్చు..మొదట టీజర్ ని కట్ చేయటామని డైరక్టర్ కు పురమాయించారట.  దాంతో ఇప్పుడా టీమ్ అంతా ఆ పనిలో పడిందిట. టీజర్ అదిరిపోవాలని, ఫ్యాన్స్ పండుగ చేసుకోవాలని ఫ్రభాస్ చెప్పారట. 

అయితే ఇంతలా లైటైన ఈ చిత్రం నుంచి ఫ్యాన్స్ ఆనందపడే వార్త ఒకటి ఉంది. ఈ చిత్రం టీజర్ ని సంక్రాంతి సందర్బంగా రిలీజ్ చేయటానికి టీమ్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం దర్శకుడు దగ్గరుండి ఈ చిత్రం టీజర్ ని కట్ చేయిస్తున్నారు. ఈ టీజర్ తో సినిమా క్రేజ్ పీక్స్ తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ టీజర్ లోనే రిలీజ్ డేట్ చెప్పే అవకాసం ఉందని సమాచారం. 

పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా రూపొందుతోన్నఈ చిత్రంలో ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి  సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో రాధేశ్యామ్ ను విడుద‌ల చేయడానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస  ఎడిటర్ :  కొటగిరి వెంక‌టేశ్వ‌రావు యాక్ష‌న్‌, స్టంట్స్‌ : నిక్ ప‌వ‌ల్, సౌండ్ డిజైన్ : ర‌సూల్ పూకుట్టి కొరియోగ్ర‌ఫి : వైభ‌వి మ‌ర్చంట్‌ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌ : తోట విజ‌య భాస్క‌ర్ అండ్ ఎకా ల‌ఖాని వి ఎఫ్ ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌ : క‌మ‌ల్ క‌న్న‌న్‌  ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ : ఎన్‌.సందీప్‌, హెయిర్‌స్టైల్‌‌ : రోహ‌న్ జ‌గ్ట‌ప్‌  మేక‌ప్‌ : త‌ర‌న్నుమ్ ఖాన్  స్టిల్స్‌ : సుద‌ర్శ‌న్ బాలాజి  ప‌బ్లిసిటి డిజైన‌ర్‌ : క‌బిలాన్‌ పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను  కాస్టింగ్ డైర‌క్ట‌ర్‌ : ఆడోర్ ముఖ‌ర్జి  ప్రోడక్షన్ డిజైనర్ : ర‌‌వీంద‌ర్‌  చిత్ర స‌మ‌ర్ప‌కులు : "రెబ‌ల్‌స్టార్" డాక్ట‌ర్ యు వి కృష్ణంరాజు   నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌శీదా  దర్శకుడు : రాధాకృష్ణ కుమార్.