రాధే శ్యామ్ సినిమా ఇప్పుడు విపరీతంగా ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. అదే విధంగా ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన ఓ సీన్ చర్చకు దారి తీస్తోంది.ఆ సీన్ చూసినవారంతా రాధేశ్యామ్ లోని కీలకమైన సీన్ కాపీనే కదా అని నిట్టూరుస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ వచ్చింది. మన రాత చేతుల్లో ఉండదు.. చేతల్లో ఉంటుందనే విషయాన్ని ఓ ప్రేమ కథతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు రాధాకృష్ణ. యూరఫ్ బ్యాక్ డ్రాప్ లో విజువల్ గ్రాండియర్ గా ఆవిష్కరించారు. బ్యూటిఫుల్ లొకేషన్స్ - మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ - కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల మనసు దోచుకున్నా ఫలితం లేకుండా పోయింది.
ప్రభాస్ గత సినిమాల మాదిరి యాక్షన్ లేకపోవడంతో మెజారిటీ ఫ్యాన్స్ 'రాధేశ్యామ్' సినిమాకు కనెక్ట్ కాలేకపోయారు. రివ్యూలు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. ఇక ఇదే సమయంలో
సోషల్ మీడియాలో రాధే శ్యామ్ సినిమా ఇప్పుడు విపరీతంగా ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. అదే విధంగా ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన ఓ సీన్ చర్చకు దారి తీస్తోంది.ఆ సీన్ చూసినవారంతా రాధేశ్యామ్ లోని కీలకమైన సీన్ కాపీనే కదా అని నిట్టూరుస్తున్నారు.
రాధేశ్యామ్ సినిమాలో జ్యోతిష్యుడు అయిన హీరో ... ఓ ట్రైన్‌లో కొందరి చేతులు చూడటం, వారి ఆయుష్షు తీరిందని తెలుసుకోవడం, ట్రైన్‌కు జరిగే ప్రమాదాన్ని నిలువరించేందుకు ప్రయత్నం చేయడం తెలిసిందే. అయితే విధిని ఎవ్వరూ తప్పించలేరు కాబట్టి.. ఆ ప్రమాదం జరుగుతుంది. ఇలాంటి సీన్ తెలుగులో గతంలోనే వచ్చేసింది. 2005లో రిలాక్స్ అనే ఓ చిత్రం వచ్చింది. అందులో విజయ్ చందర్ ప్రముఖ జ్యోతిష్యుడిగా కనిపిస్తాడు. ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా.. జాతకం చూడమని అడుగుతుంటారు. అక్కడ అందరి జాతకాలు చూసి షాక్ తింటాడు. ట్రైన్‌కు ప్రమాదం జరుగుతుందని, అందరూ చనిపోతారని తెలుస్తుంది.
ఇదే విషయాన్ని రైల్వే స్టేషన్‌లో గార్డ్‌కు చెబుతాడు. కానీ ఎవ్వరూ నమ్మరు. ప్రమాదం జరుగుతుంది. అందరూ చనిపోతారు. సేమ్ టు సే మ్ ఇలాంటి సీన్ మనకు రాధే శ్యామ్ సినిమాలోనూ కనిపిస్తుంది. మొత్తానికి ఈ సీన్‌ను రాధాకృష్ణ కాపీ కొట్టేశాడే అంటున్నారు. అయితే అంతకు ముందే ఇలాంటి ఓ సీన్ మళయాలం సినిమా అయ్యిర్ ది గ్రేట్ సినిమాలో కూడా ఉంది. ఇది నిజానికి ఓ జ్యోతిష్కుడి జీవితంలో జరిగిందని చెప్తున్నారు.
