Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ పర్శనల్ గా పర్యవేక్షణ, కారణం ఇదే!

ప్రభాస్ కు ఇది పరిక్షా సమయం. బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రభాస్...తన తదుపరి చిత్రంతో దాన్ని నిలబెట్టుకుంటారా లేదా అన్నది అందరూ ఎదురుచూస్తున్న విషయం. 

Prabhas personally overseeing VFX work
Author
Hyderabad, First Published Jul 15, 2019, 4:39 PM IST

ప్రభాస్ కు ఇది పరిక్షా సమయం. బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రభాస్...తన తదుపరి చిత్రంతో దాన్ని నిలబెట్టుకుంటారా లేదా అన్నది అందరూ ఎదురుచూస్తున్న విషయం. ఈ విషయం ప్రభాస్ కు స్పష్టంగా తెలుసు. అందుకే తానే స్వయంగా సాహో కు సంభందించిన ప్రతీ విషయంలోనూ ఇన్వాల్వ్ అయ్యి  పని చేస్తున్నారు. మరీ ముఖ్యంగా విఎఫ్ ఎక్స్ విషయంలో ఆయన పర్శనల్ గా తీసుకుని కష్టపడుతున్నట్లు సమాచారం.

అలా ఎందుకు చేస్తున్నారు అంటే...ఈ రోజుకు సాహో రిలీజ్ .. సరిగ్గా నెల  ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇంకా జరుగుతూనే ఉంది. మిగతా పనులన్నీ పూర్తైనా,  విజువల్‌ ఎఫెక్ట్స్‌ మాత్రం ఓ కొలిక్కి రాలేదు. దాంతో ఈ సినిమా వాయిదా పడే అవకాసం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో  స్వయంగా ప్రభాస్‌ రంగంలోకి దిగాడు. 

సాహో పూర్తిగా యాక్షన్ ఎడ్వెంచర్ థ్రిల్లర్. సినిమాలో హై ఎండ్ యాక్షన్ స్టంట్స్  దుబాయి, అబు దాబిలో చిత్రీకరించారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ చేత ఆ సీన్స్ తీయించారు. ఆ సీన్స్ సినిమాకు అతి కీలకం.  ఇండియన్ సీన్ మీద ఇప్పటికీ చూడని సీక్వెన్స్ ఈ సినిమాలో ఉండాలని ప్రభాస్ భావిస్తున్నారు. దానికి తోడు స్టంట్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ కీలకం. అవి ఏమాత్రం తేడా కొట్టినా సినిమా తేలిపోతుంది. అందుకే ప్రతీ షాట్ పరీశీలించి ఓకే చేస్తున్నారట. దానికి తోడు ఈ సినిమా టీజర్ లో చూపించిన ఫైట్స్.. గ్రాఫిక్స్ లాగ ఉన్నాయని టాక్ రావటం కూడా అందుకు కారణం అంటున్నారు. 

డైరక్టర్ సుజీత్ మరో ప్రక్క మిక్సింగ్ వర్క్ పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్, ముంబై, చెన్నైలలో అన్ని టీమ్స్ ప్రభాస్ కంట్రోలులో పనిచేస్తున్నాయి. ఈ నెలాఖరకు విఎఫ్ ఎక్స్ వర్క్ పూర్తి చేసి, ఫస్ట్ తారీఖు డెడ్ లైన్ గా పస్ట్ కాపీ వచ్చేయాలని డిసైడ్ చేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios