పరిస్దితి బాలేదని ప్రభాస్...'రాధే శ్యామ్' డైరక్టర్ కు స్ట్రిక్ట్ ఆర్డర్స్ !?
ఈ నిబంధనలు నవంబర్ 24 వరకు అమల్లో ఉంటాయి. ఇవన్నీ నిశితంగా గమనిస్తున్న ప్రభాస్ ..తన టీమ్ కు,ముఖ్యంగా దర్శకుడు సాధ్యమైనంత త్వరగా షూటింగ్ ముగించమని ఆర్డర్ వేసారట. ఇలాంటి పరిస్దితుల్లో చెక్కే కార్యక్రమాలు పెట్టుకోవద్దని అన్నారుట. కీలకమైనవి ప్లాన్ చేసుకుని తీసేసుకుంటే ..మిగిలనవి ఇండియా లో తీసుకోవచ్చని సూచించారట.
ప్రభాస్ తన టీమ్ తో కలిసి 'రాధే శ్యామ్' షూటింగ్ నిమిత్తం ఇటలీ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ ఫినిష్ కావటానికి మరికొద్ది రోజులు మిగిలి ఉంది. అయితే ఈ లోగా ఇటలీ లో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. ఇటలీలో కరోనా తీవ్రత తగ్గాక రోజుకు కేవలం 200 కరోనా కేసులు మాత్రమే వచ్చాయి. ఇక తగ్గిందనుకున్న సమయంలో ఒక్కసారిగా మరోసారి వైరస్ విజృంభించింది. ఇక్కడ ఇప్పుడు రోజుకు 17 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో ఇటలీలో కరోనా అదుపునకు మళ్లీ ఆంక్షలు విధించారు. బార్లు, రెస్టారెంట్లను సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని తెలిపారు.
క్రీడలు, ఇతర ఆహ్లాదభరిత కార్యక్రమాలను రద్దు చేశారు. విద్యార్థులకు మళ్లీ ఆన్‌లైన్ క్లాస్‌లు మొదలుపెట్టారు. ఈ నిబంధనలు నవంబర్ 24 వరకు అమల్లో ఉంటాయి. జనాల్లో కోపం పెరిగినా.. కొవిడ్‌ను అదుపు చేయడానికి ఈ నిబంధనలు తప్పవని ప్రధాని గ్యుసేప్ కాన్ట్ తెలిపారు. ఇవన్నీ నిశితంగా గమనిస్తున్న ప్రభాస్ ..తన టీమ్ కు,ముఖ్యంగా దర్శకుడు సాధ్యమైనంత త్వరగా షూటింగ్ ముగించమని ఆర్డర్ వేసారట. ఇలాంటి పరిస్దితుల్లో చెక్కే కార్యక్రమాలు పెట్టుకోవద్దని అన్నారుట. కీలకమైనవి ప్లాన్ చేసుకుని తీసేసుకుంటే ..మిగిలనవి ఇండియా లో తీసుకోవచ్చని సూచించారట.
పీరియాడికల్ లవ్‌స్టోరిగా రూపొందుతోన్నఈ చిత్రంలో ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రాధేశ్యామ్ ను విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జగపతిబాబు, జయరాం, సచిన్ ఖేడ్‌కర్, భీనా బెనర్జి, మురళి శర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్, సత్యాన్ తదితరులు సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస ఎడిటర్ : కొటగిరి వెంకటేశ్వరావు యాక్షన్, స్టంట్స్ : నిక్ పవల్, సౌండ్ డిజైన్ : రసూల్ పూకుట్టి కొరియోగ్రఫి : వైభవి మర్చంట్ కాస్ట్యూమ్స్ డిజైనర్ : తోట విజయ భాస్కర్ అండ్ ఎకా లఖాని వి ఎఫ్ ఎక్స్ సూపర్‌వైజర్ : కమల్ కన్నన్ ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ : ఎన్.సందీప్, హెయిర్‌స్టైల్ : రోహన్ జగ్టప్ మేకప్ : తరన్నుమ్ ఖాన్ స్టిల్స్ : సుదర్శన్ బాలాజి పబ్లిసిటి డిజైనర్ : కబిలాన్ పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను కాస్టింగ్ డైరక్టర్ : ఆడోర్ ముఖర్జి ప్రోడక్షన్ డిజైనర్ : రవీందర్ చిత్ర సమర్పకులు : "రెబల్‌స్టార్" డాక్టర్ యు వి కృష్ణంరాజు నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రశీదా దర్శకుడు : రాధాకృష్ణ కుమార్.