‘ప్రాజెక్ట్ కే’ గురించి ప్రభాస్ ఇలా అనేసాడేంటి?
ప్రాజెక్టు కే చిత్రం గురించి ప్రభాస్ ఏమి మాట్లాడతాడా అని ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది. ఆ టైమ్ లో ప్రభాస్ ఏమన్నారంటే...

ప్రభాస్ హీరోగా నటిస్తున్న గ్లోబల్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ఫస్ట్ గ్లింప్స్‌కు అద్భుత స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్‍లో గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సినీ ప్రేక్షకుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఈ ఫస్ట్ గ్లింప్స్‌ను ప్రశంసిస్తున్నారు. గ్రాఫిక్స్, ప్రభాస్ లుక్, టేకింగ్ అదిరిపోయాయని అందరూ మెచ్చుకుంటున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్‍ను పొగుడుతున్నారు. ఫ్యుచరెస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తీస్తుండటంతో ఆసక్తి, ఎక్సపెక్టేషన్స్ మరింత భారీగా పెరిగిపోయాయి.
అదే సమయంలో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్, నాగ్ అశ్విన్, కమల్ హాసన్, రానా ఇచ్చిన స్పీచులు, అక్కడి మీడియాకు ఇచ్చిన సమాధానాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక నాగ్ అశ్విన్ అయితే మన దేశ ఇతిహాసాలు, మన దేవుళ్ల గురించి అక్కడి వారికి లైట్‌గా పరిచయం చేశాడు. మీకు థోర్, హల్క్‌లు ఉంటే.. మాకు ఆంజనేయుడు ఉన్నాడు అంటూ నాగ్ అశ్విన్ చేసిన కామెంట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రాజెక్ట్ కే (కల్కి 2898 ఏడీ) సినిమాలో తన పాత్ర గురించి ప్రభాస్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
తన పాత్ర గురించి ప్రభాస్ చెబుతూ ఫన్నీ కామెంట్లు చేశారు. ఈ సినిమా మొత్తంలో కాస్త ఫన్నీగా కనిపించేది తన పాత్రేనని, ఈ సినిమాలో ఎక్కువగా ఎమోషన్స్ ఉంటాయని, ఒక రకంగా చెప్పాలంటే తాను ఈ సినిమాలో కమెడియన్ అంటూ ఫన్నీగా చెప్పేశాడు ప్రభాస్. ." ఇది ఒక సూపర్ హీరో ఫిలిం అని, ఈ సినిమాలో తన క్యారెక్టర్ని నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన తీరు తనకు చాలా బాగా నచ్చిందని, అంతేకాకుండా మొత్తం ప్రాజెక్ట్ కే టీం లో నాగ్ అశ్విన్ చాలా సరదా మనిషని, ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ ని డిజైన్ చేశారని, కానీ సినిమాలో నా పాత్ర కామెడీగా ఉంటుందని, సినిమాలో నేనే కమేడియన్" అంటూ నవ్వుతూ చెప్పారు.
అలాగే ఈ చిత్రంలో విలన్‌గా కమల్ హాసన్ మాట్లాడుతూ... చెడు లేనిదే మంచి ఉండదని, చెడు ఉంటేనే మంచి విలువ తెలుస్తుందని, తనకు మంచి పాత్రను ఇచ్చాడంటూ నాగ్ అశ్విన్ మీద ప్రశంసలు కురిపించాడు కమల్ హాసన్. ఇక అమితాబ్ పాత్ర గురించి ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. అశ్వథ్థామ పాత్రలో అమితాబ్ కనిపించబోతోన్నాడు. శ్రీ కృష్ణుడు ఇచ్చిన శాపం ప్రకారమే అశ్వథ్థామను ఇందులో చూపించబోతోన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా రెండు పార్టులుగా వచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది.