ఈ తరహా  సినిమాను కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విడుదల చేస్తున్నారు. అక్కడి సెన్సార్‌కు తగినట్లుగా అన్నీ ఉండాలి. 


గత కొద్ది రోజులుగా మీడియా మొత్తం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salar) వాయిదా గురించే కబుర్లు. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సెప్టెంబర్ 28 ఎప్పుడు వస్తుంది అంటూ రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా సలార్ రిలీజ్ పోస్ట్ పోన్ అనటం..మీడియాలో ఇదే హాట్ టాపిక్ అవటం ప్రభాస్ కు ఇబ్బందిగా ఉందని తెలుస్తోంది. 

ఇంతకు ముందు ఆదిపురుష్ సినిమా కూడా అదే పరిస్దితి. వాయిదాలు మీద వాయిదాలు పడుతూ రిలీజైంది. ఇప్పుడు సలార్ వాయిదా అనటం, ప్రాజెక్టు కే కూడా సంక్రాంతికి వచ్చే అవకాసం లేదని తెలియటంతో ప్రభాస్ సినిమాలకే ఇలాంటి సిట్యువేషన్ వస్తోందని అంటున్నారు. ఎంత ప్రాపర్ ప్లానింగ్ చేసినా ఆయన సినిమాలు భారివి కావటం, విఎఫ్ ఎక్స్ కు అధిక శాతం ప్రయారిటీ ఉండటంతో డైరక్టర్స్ చేతిలో రిలీజ్ డేట్స్ ఉండటం లేదంటున్నారు. నిర్మాతలు ఆ ఆలస్యానికి వచ్చే నష్టం భరించినా, ప్రభాస్ ఓకే అన్నా..ఈ సినిమా రిలీజ్ లు ని దృష్టిలో పెట్టుకుని మిగతా సినిమాలు రిలీజ్ లు ఉండటంతో అవి మొత్తం డిస్ట్రబ్ అవుతున్నాయి. వాళ్లది మింగలేక కక్కలేక అన్న పరిస్దితి. భారీ స్థాయిలో సినిమాను నిర్మిస్తున్నప్పుడు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇవాళ ఈ తరహా సినిమాను కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విడుదల చేస్తున్నారు. అక్కడి సెన్సార్‌కు తగినట్లుగా అన్నీ ఉండాలి. 

ఇక ప్రభాస్‌ను డైనోసార్‌గా పోలుస్తూ విడుదల చేసిన ‘సలార్‌’ గ్లింప్స్‌ సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసింది. విదేశాల్లో టికెట్‌ బుకింగ్స్‌ కూడా అయిపోయాయి. ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ (Salaar: Part 1 Ceasefire) సెప్టెంబరు 28న కాకుండా నవంబరులో వస్తే, చాలా సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉందని, సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళలో విడుదలయ్యే అనేక సినిమాలు వాయిదా పడక తప్పదు.

ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న ‘సలార్‌’ విడుదలైతే బాక్సాఫీస్‌ మామూలుగా ఉండేది కాదు. షారుఖ్‌ నటించిన ‘జవాన్‌’ సెప్టెంబరు 7న రాబోతోంది. అంటే ఈ సినిమా విడుదలైన మూడు వారాలకు ‘సలార్‌’ విడుదల కావాలి. అలా జరిగి ఉంటే, గత నెల మాదిరిగానే (‘జైలర్‌’, ‘గదర్2’) ఈ నెల కూడా కాసుల వర్షం కురిసేది. ఇప్పుడు ‘సలార్‌’ను నవంబరు 24వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్‌. అలా జరిగితే అప్పటికే షెడ్యూల్‌ ఫిక్స్‌ చేసుకున్న అనేక సినిమాలు తమ విడుదల తేదీని మార్చుకోక తప్పదు. మరీ ముఖ్యంగా ఈ దీపావళికి సల్మాన్‌ ‘టైగర్‌3’ రాబోతోంది. తమిళంలో ‘అయలాన్‌’, ‘జపాన్‌’, ‘జిగర్తాండ2’ రాబోతున్నాయి. ఇప్పుడు వీటి విడుదల ప్రశ్నార్థకంగా మారుతుంది.

 ‘సలార్‌’ను నిర్మిస్తున్న హోంబాలే ఫిల్మ్‌ మాత్రం ఇప్పటివరకూ ఏమీ రెస్పాండ్ అవలేదు. తమ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలో ‘సలార్‌’ విడుదల తేదీ సెప్టెంబరు 28నే అని ఉంచారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం.. ‘సలార్‌’ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ విషయంలో ప్రశాంత్‌ నీల్‌ సంతోషంగా లేరని టాక్‌. ఎడిటింగ్‌ టేబుల్‌ ముందు కూర్చొన్న ఆయన అనుకున్న విధంగా కొన్ని షాట్స్‌ రాలేదట. దీంతో వాటిని మళ్లీ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌కు పంపారట. దీంతో సినిమా విడుదల వాయిదా అన్న టాక్‌ బయటకు వచ్చింది. 

మరోవైపు ‘సలార్‌’ విడుదల వాయిదా అని వార్తలు రావడంతో పలు చిత్రాలు ఆ తేదీలో వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కిరణ్ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’ను సెప్టెంబరు 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ అక్టోబరు 20న విడుదల కావాల్సి ఉండగా, దాన్ని ముందుకు తీసుకురాబోతున్నారని టాక్‌. ఇక ‘సలార్‌’ విడుదల వాయిదా వార్తల నేపథ్యంలో సోషల్ మీడియా లో మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి.