పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కేవలం తెలుగు దర్శకులే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం డార్లింగ్‌తో మూవీస్ చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ ఫ్యాన్స్ తో మీడియా వాళ్లు ఆడుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఆయన సినిమాలపై వస్తున్న వార్తలు చూస్తూంటే. ముఖ్యంగా మారుతి తో చిత్రం లేదు అనుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నా రు. అయితే ఇప్పుడు నిర్మాత డిడివి దానయ్య ఈ ప్రాజెక్ట్ ని ఎలాగైనా పట్టాలెక్కించాలనే ప్లానింగ్ లో ఉన్నారట. ఈ క్రమంలో ప్రభాస్ ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సెప్టెంబర్ లో ఈ చిత్రం ప్రారంభం కానుంది.
రాజా డీలక్స్ అనే థియేటర్ చుట్టూ తిరిగే ఈ కథ తో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. సెప్టెంబర్ లో 10 రోజులు ఖాళీగా ఉన్నాయని ప్రభాస్ డేట్స్ కేటాయించారట. ఈ మేరకు మారుతి ఎరేంజ్మెంట్స్ చేసుకుంటున్నట్లు చెప్తున్నారు. అనుష్క,మాళవిక మోహన్ ఈ సినిమాకు ప్రభాస్ కు జోడిగా కనిపించనున్నారు. ఇదో హారర్ కామెడీ అని తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ రాబోతోందని వినికిడి. ఈ వార్త విన్నాక మారుతితో సినిమా అనగానే ఫ్యాన్స్ కు టెన్షన్ పట్టుకునట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లను బట్టి తెలుస్తోంది. పక్కా కమర్షియల్ చిత్రం డిజాస్టర్ తర్వాత మారుతి తో సినిమా అంటే ఆ మాత్రం భయం ఉంటుందని మిగతా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కేవలం తెలుగు దర్శకులే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం డార్లింగ్‌తో మూవీస్ చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రాజెక్ట్ కె, సలార్ చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాల్సిన స్పిరిట్ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.
