Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ కమిటైంది కన్నడ రీమేక్ సినిమానా?

ఈ క్రమంలోనే తాజాగా 'తానాజీ' ద‌ర్శ‌కుడు ఔంరౌత్‌తో క‌లిసి ప్ర‌భాస్ సినిమా ఎనౌన్స్ చేసారు. ఇదే సమయంలో ఆయన ఓ కన్నడ రీమేక్ సైన్ చేసారనే వార్త అంతటా వినపడుతోంది. ఆ సినిమా మరేదో కాదు ఉగ్రం రీమేక్ అని చెప్తున్నారు.

Prabhas Next kannada Remake Ugram Film?
Author
Hyderabad, First Published Aug 18, 2020, 10:56 AM IST

బాహుబ‌లి చిత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ద‌క్కించుకున్న ప్ర‌భాస్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్,టాలీవుడ్,కోలీవుడ్ అనే తేడా లేకుండా ఎక్కడెక్కడి ద‌ర్శ‌కులు తెగ‌ ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రభాస్ తనకు నచ్చిన దర్శకుడుని ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'తానాజీ' ద‌ర్శ‌కుడు ఔంరౌత్‌తో క‌లిసి ప్ర‌భాస్ సినిమా ఎనౌన్స్ చేసారు. ఇదే సమయంలో ఆయన ఓ కన్నడ రీమేక్ సైన్ చేసారనే వార్త అంతటా వినపడుతోంది. ఆ సినిమా మరేదో కాదు ఉగ్రం రీమేక్ అని చెప్తున్నారు.

ఎన్టీఆర్ తో ఇప్పటికే సినిమా కమిటైన కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నిల్ ఇప్పుడు ప్రభాస్ తో కొత్త కథ వండటం కన్నా ఆల్రెడీ తను గతంలో హిట్ ఇచ్చిన సినిమాకు కొద్ది పాటి రిపేర్ల్ చేస్తే సరిపోతుందని భావిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఇందులో నిజమెంత ఉందనేది తెలియదు. ఎందుకంటే ప్రభాస్ స్దాయి సినిమా అంటే అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తారు. కన్నడంలో ఆల్రెడీ రిలీజైన సినిమా రీమేక్ అక్కడ అంత బజ్ రాదు. అయితే మిగతా భాషల్లోకి ఉగ్రం వెళ్లలేదు కాబట్టి ఇబ్బంది లేదు. ప్రభాస్ కు మాత్రం ఉగ్రం సినిమా తెగ నచ్చేసిందిట. దిల్ రాజు నిర్మాతగా ఉగ్రం రీమేక్ చేద్దామని చాలా రోజుల నుంచి ఊగుతున్నారు. 

ఇక ప్రశాంత్‌ నిల్‌  2014లో వచ్చిన ఉగ్రం చిత్రంతో కన్నడ సినీ పరిశ్రమలో ప్రవేశించారు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ నిలిచింది. తర్వాత కేజీఎఫ్‌కు రచయిత, డైరెక్టుగా పని చేశారు. ఆ సినిమా కన్నడ పరిశ్రమంలో ఆల్‌ టైం హైయస్ట్‌ కలెక్షన్లను వసూలు చేసింది. తర్వాత ఆయన కేజీఎఫ్‌కు కొనసాగింపుగా కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 నిర్మాణంలో ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో కన్నడ వీక్లి మ్యాగజైన్లో డబ్బు కోసమే దర్శకత్వం వైపు వచ్చానని వెల్లడించారు. 

తర్వాత ఆయన ఫిల్మ్‌ కోర్సు పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. అయినా ఆయనకు ఏదొక వెలితి. ఆ ఆలోచన నుంచి వచ్చిన యాక్షన్‌ సినిమా ఉగ్రం. తన బావ సినీ నటుడు శ్రీమురళి చేస్తున్న చిత్రానికి స్టోరీ, స్క్రిన్‌ ప్లే అందించారు. అలా 2014లో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్‌గా విజయాన్ని అందుకుంది. కన్నడ పరిశ్రమంలో హైయస్ట్‌ గ్రాస్‌ కలెక్షన్స్ చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఉగ్రం   సీక్వెల్‌గా ఉగ్రం వీరం అనుకున్నారు. ఉగ్రం చిత్రంలో హీరోగా శ్రీమురళి చేయనున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios