Asianet News TeluguAsianet News Telugu

Prabhas: ప్రభాస్ కొత్తింటికి ఎన్ని కోట్లు పెడుతున్నాడో తెలుసా..? వైరల్ అవుతున్న న్యూస్.

యంగ్ రెబల్ స్టార్ కొత్తిల్లు కట్టుకుంటున్నారా..? దాని కోసం కోట్లు కుమ్మరించబోతున్నాడా..? ప్రభాస్ కడుతున్న ఇంటి కాస్ట్ ఎంతో తెలుసా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత..? 
 

Prabhas New House Constaction With 320 Crorce JMS
Author
First Published Nov 15, 2023, 5:10 PM IST

టాలీవుడ్ లో చిన్న హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేసి.. పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమా తరువాత ప్రపంచ వ్యాప్తం గుర్తింపు సాధించిన ప్రభాస్..  ప్రస్తుతం చేస్తున్నసినినిమాలన్నీ.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే. ఇప్పటికే  బాహుబలి తరువాత మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకో లేకపోయినా కమర్షియల్ గా మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టాయి.

ఇక ప్రభస్ నుంచి  త్వరలోనే సలార్ సినిమా రాబోతోంది. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ప్రభాస్ కొత్త ఇంట్లోకి వెళ్లబోతున్నారట. ఇప్పటికే ప్రభాస్ కు  హైదరాబాద్ లో చాలా ఇళ్ళు ఉన్నాయి. అయితే ఆయన మాత్రం పెద్దమ్మ గుడి దగ్గరలో ఉన్న ఇంట్లో ఉంటూ వస్తున్నారు. అయితే అక్కడ  ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో.. ప్రభాస్ ఇల్లు మారాలి అనుకుంటున్నారట. దానికి తగ్గట్టు తాను డ్రీమ్ హౌస్ కట్టుకోబోతున్నట్టు తెలుస్తోంది. 

సాయి ధరమ్ తేజ్ కు అవమానం, నెటిజన్ కు కౌంటర్ ఇచ్చిన మెగా మేనల్లుడు, అసలేం జరిగిందంటే..?

సిటీ బయట తన డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని గతంలో రెండు ఎకరాల స్థలం కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ స్థలం కోసం ప్రభాస్ ఏకంగా 120 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వార్తలు వినిపించాయి అయితే తాజాగా ఆ స్థలంలో ఈయన కొత్త ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలుస్తుంది. ఈ ప్రాంతంలో ఏకంగా 200 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభాస్ కొత్త ఇల్లు కట్టబోతున్నారని సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios