బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ సాహో సినిమాతో ఎప్పుడు వస్తాడా అని కోట్లాది భారతీయులు ఎదురుచూస్తున్నారు. నేషనల్ లెవెల్లో స్టార్ డమ్ అందుకున్న ఈ హీరో ఓ వైపు సినిమాల రెమ్యునరేషన్ ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటూనే ఇతర బిజినెస్ లలో కూడా బిజీ అవుతున్నాడు.
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ సాహో సినిమాతో ఎప్పుడు వస్తాడా అని కోట్లాది భారతీయులు ఎదురుచూస్తున్నారు. నేషనల్ లెవెల్లో స్టార్ డమ్ అందుకున్న ఈ హీరో ఓ వైపు సినిమాల రెమ్యునరేషన్ ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటూనే ఇతర బిజినెస్ లలో కూడా బిజీ అవుతున్నాడు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సినిమా థియేటర్స్ షాపింగ్ మాల్స్ ను తన బ్రాండ్ గా డెవలప్ చేయాలనీ అనుకుంటున్నాడు.
ఇక సినిమా థియేటర్స్ ని కూడా చాలా వరకు ఆధీనంలోకి ఉంచుకోవడం బెటర్ అని దిల్ రాజు అల్లు అరవింద్ వంటి వారితో పోటీకి సిద్ధమయ్యారు. థియేటర్స్ బిజినెస్ చాలా వరకు కలిసొస్తుందని అగ్ర హీరోలు పెట్టుబడులు బాగానే పెడుతున్నారు. ప్రభాస్ కూడా ఇన్వెస్ట్ చేసి తన అధీనంలో కూడా కొన్ని థియేటర్స్ ని ఉంచుకోవాలని అనుకుంటున్నాడట.
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రముఖ ప్రాంతాల్లో థియేటర్లను కొనుగోలు చేసి కొని వాటిని మోడరన్ ఫెసిలిటీస్ తో లుక్కు మొత్తం మార్చేసి వీలైనంత వరకు థియేటర్స్ ని చేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి ప్రభాస్ ఈ బిజినెస్ లో ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
