Asianet News TeluguAsianet News Telugu

Project K: ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్, అమితాబ్, నాని, దుల్కర్ సల్మాన్..ఫోటో వైరల్, విశేషం ఏంటంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ప్రస్తుతం వేల కోట్లల్లో బిజినెస్ జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. 

Prabhas nani and other stars at Project K new office launch
Author
Hyderabad, First Published Jun 27, 2022, 2:29 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ప్రస్తుతం వేల కోట్లల్లో బిజినెస్ జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె ఇలా ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ ఆషామాషీ చిత్రాలు కావు. 

ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్ర షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. సలార్ చిత్రం కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

ఇక ప్రాజెక్ట్ కె చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో విజువల్ వండర్ గా తీర్చిదిద్దతున్నాడు యువ దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ చిత్రంలో క్రేజీ నటీనటులు నటిస్తున్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొనె నటిస్తుండగా బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ కె మూవీ కోసం వైజయంతి సంస్థ గచ్చిబౌలిలో కొత్త ఆఫీస్ ని ప్రారంభించింది. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ప్రభాస్, నేచురల్ స్టార్ నాని, రాఘవేంద్ర రావు, దర్శకుడు ప్రశాంత్ నీల్, మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు. వీరితో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. 

ఇలా ప్రభాస్, నాని, అమితాబ్ లాంటి నటులు ఒకే ప్రేములో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రాజెక్ట్ కె చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios