ప్రభాస్-మారుతి కాంబోలో మూవీ తెరకెక్కుతుండగా ఇంత వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఎట్టకేలకు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు.  

వరుస చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. గత ఏడాది ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ చిత్రాలు విడుదలయ్యాయి. సలార్ భారీ వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. ప్రస్తుతం కల్కి 2829 AD, మారుతి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ సమ్మర్ కానుకగా మే 9న విడుదల కానుంది. కల్కి మూవీలో కమల్ హాసన్ కీలక రోల్ చేస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్. 

కాగా దర్శకుడు మారుతితో చేస్తున్న చిత్ర షూటింగ్ మొదలై చాలా కాలం అవుతుంది. అధిక భాగం సెట్స్ లో పూర్తి చేస్తున్నారు. ఈ మూవీపై ఇంత వరకు ఎలాంటి అప్డేట్ లేదు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ని పలుమార్లు మారుతి మూవీ అప్డేట్ అడిగినా... ఆయన స్పష్టమైన సమాధానం చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు అప్డేట్ ఇస్తాం అన్నారు. 

సడన్ సర్ప్రైజ్ ఇస్తూ... సంక్రాంతి కానుకగా టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. జనవరి 15వ తేదీన ఉదయం 7:08 నిమిషాలకు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ విడుదల కానున్నాయి. 2024 సంక్రాంతికి ప్రభాస్ ఫ్యాన్స్ కి రెండు అప్డేట్స్ వచ్చినట్లయింది. కల్కి విడుదల తేదీ ప్రకటించగా, మారుతి చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ విడుదల చేస్తున్నారు. 

అనూహ్యంగా ప్రభాస్ తో మారుతి హారర్ కామెడీ మూవీ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ ఇమేజ్ కి భిన్నమైన ఈ సబ్జెక్టు ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

Scroll to load tweet…