ప్రభాస్ సినిమా నుంచి సంక్రాంతి సర్‌ప్రైజ్ వచ్చింది. మారుతి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మూవీ టైటిల్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. వింటేజ్ ప్రభాస్ రచ్చ చేస్తున్నాడు.
డార్లింగ్, గ్లోబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా సంక్రాంతి ట్రీట్ వచ్చింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఫ్యాన్స్ కి సంక్రాంతి ట్రీట్ ఇచ్చారు. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ని సోమవారం ఉదయం విడుదల చేశారు. `ది రాజా సాబ్`(The RaajaSaab) అనే టైటిల్ నిర్ణయిస్తూ అదిరిపోయే ఫస్ట్ లుక్‌ని ఇచ్చారు. ఇందులో ప్రభాస్ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. సంక్రాంతి సందడి తీసుకొచ్చినట్టుగా ఆయన ఫస్ట్ లుక్ ఉండటం విశేషం.
ఇందులో ప్రభాస్ లుంగీ పైకి ఎత్తి డాన్సు చేస్తున్నాడు. బ్లాక్ షర్ట్ ధరించాడు. లుక్ కూడా కొత్తగా ఉంది. అలాగే యంగ్‌గా ఉన్నాడు.ఓ పదేళ్ల క్రితం ప్రభాస్‌ని తలపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ కలర్‌ఫుల్‌గా ఉంది. ఇది ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందట. హర్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్లతో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఫ్యామిలీ ఎలిమెంట్లు, కామెడీ, ఫైట్లు ఉండబోతున్నాయట. అయితే అన్నింటిలోనూ ఫన్ మెయిన్‌గా ఉంటుందని తెలుస్తుంది. మారుతి మార్క్ కమర్షియల్ మూవీ అంటున్నారు. ఈ మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్ కూడా ఉండబోతుందట.
చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ ఇలాంటి ఒక ఫ్యామిలీ మూవీ చేస్తున్నారు. ఇందులో ఆయన కామెడీ కూడా చేస్తాడట. ఫస్ట్ లుక్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతుంది. ఇక మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలుస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని తెరకెక్కిస్తుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి `రాజా డీలక్స్` అనే పేరు వినిపించింది. దానిలో కొంచెం మార్పులు చేసి `ది రాజా సాబ్` చేసినట్టు తెలుస్తుంది. కానీ వింటేజ్ ప్రభాస్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.
